ఇండియన్ మార్కెట్ లో రూ. 15,000 ధరలో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ కోసం చూస్తున్నారా? అయితే, మీకు చాలా అప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ ఫోన్లలో ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ను బడ్జెట్ ధరలో అందించే స్మార్ట్ ఫోన్లు కొన్ని ఉన్నాయి. ఈరోజు అటువంటి best phone under 15000 లిస్ట్ చూడనున్నాము మరియు వాటి ధర వివరాలను కూడా తెలుసుకోనున్నాము. మరింకెందుకు ఆలశ్యం, వెంటనే ఆ స్మార్ట్ ఫోన్స్ ఏమిటో చేసేద్దాం పదండి.
ధర : రూ. 12,999
ఇండియన్ మార్కెట్ లో బడ్జెట్ ధరలో వివో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ఆల్రౌండ్ ప్రతిభను కనబరుస్తుంది మరియు Flipkart పైన 4.4 యూజర్ రేటింగ్ ను అందుకుంది. ఈ ఫోన్ స్లిమ్ బాడీ డిజైన్, 5000 mAh బిగ్ బ్యాటరీ, మీడియాటెక్ లేటెస్ట్ ప్రోసెసర్ Dimensity 6020, 50MP సూపర్ నైట్ కెమేరా బిగ్ FHD+ డిస్ప్లే వంటి ఫీచర్లతో ఆకట్టుకుంది.
ధర : రూ. 14,999
పోకో నుండి వచ్చిన ఈ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 15 వేల కంటే తక్కువ ధరలో Super AMOLED డిస్ప్లే, 48MP ట్రిపుల్ రియర్ కెమేరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన బిగ్ బ్యాటరీ, 6GB ర్యామ్ కి జతగా హెవీ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు Snapdragon 695 5G ప్రోసెసర్ వంటి ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ పెర్ఫార్మెన్స్, డిస్ప్లే మరియు డిజైన్ పరంగా యూజర్ల కితాబు అందుకుంది. ఈ ఫోన్ Flipkart పైన ఓవరాల్ 4.1 యూజర్ రేటింగ్ ను అందుకుంది.
ధర : రూ. 14,990
హెవీ బ్యాటరీతో సింపుల్ 5G స్మార్ట్ ఫోన్ కోరుకునే వారికి ఈ శామ్సంగ్ 5G స్మార్ట్ ఫోన్ మంచి అప్షన్. ఈ స్మార్ట్ ఫోన్ 6000 mAh హెవీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50MP Tట్రిపుల్ రియర్ కెమేరా, 128GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్, 5nm ఆక్టా కోర్ ప్రోసెసర్, 90Hz FHD+ డిస్ప్లే వంటి ఫీచర్ లతో వస్తుంది.
ధర : రూ. 12,990
ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా తీసుకొచ్చిన ఈ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ 13 వేల కంటే తక్కువ ధరలో 8GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వచ్చే ఏకైక స్మార్ట్ ఫోన్ గా నిలుస్తుంది. ఈ బడ్జెట్ లో ఈ ఫోన్ 50MP AI ట్రిపుల్ రియర్ కెమేరా, 8GB ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్ ఫీచర్, 2K Video రికార్డింగ్ సపోర్ట్, 5G ప్రాసెసర్, బ్యాగ్రౌండ్ లో Youtube స్ట్రీమింగ్ సపోర్ట్, మీడియాటెక్ 5G ప్రోసెసర్, 5000 mAh బిగ్ బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది.