రూ.7,000 ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ కోసం చూస్తున్నారా?

రూ.7,000 ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ కోసం చూస్తున్నారా?
HIGHLIGHTS

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు కేవలం బడ్జెట్ ధరలో కూడా మంచి ఫీచర్లతో మర్కెట్లో లభిస్తున్నాయి

మొబైల్ తయారీ కంపెనీలు ఆకర్షణీయమైన ఫీచర్లను బడ్జెట్ ధర మొబైల్స్ లో కూడా అందిస్తున్నారు

మంచి ఫీచర్లతో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్లను గురించి చూడనున్నాము

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు కేవలం బడ్జెట్ ధరలో కూడా మంచి ఫీచర్లతో మర్కెట్లో లభిస్తున్నాయి. ఎందుకంటే, మార్కెట్లో వున్న బలమైన కాంపిటీషన్ తో మొబైల్ తయారీ కంపెనీలు ఆకర్షణీయమైన ఫీచర్లను బడ్జెట్ ధర మొబైల్స్ లో కూడా అందిస్తున్నారు. అందుకే, ఈరోజు రూ.7,000 రూపాయల బడ్జెట్ లో మంచి ఫీచర్లతో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్లను గురించి చూడనున్నాము. ఇండియన మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న ఆ బ్స్ స్మార్ట్ ఫోన్లు వారి వివరాలు ఏమిటో చూద్దామా.

5. గెలాక్సీ A03 కోర్ (Buy Here)

సాంసంగ్ గెలాక్సీ ఎ03 కోర్  స్మార్ట్ ఫోన్ పెద్ద 6.5 – అంగుళాల HD + (1600 x 720 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్‌ప్లే మరియు ముందు భాగంలో V కటౌట్ నోచ్ ఉన్నాయి. గెలాక్సీ ఎ03 కోర్ ఫోన్ Unisoc SC9863A ఆక్టా-కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది. మైక్రో ఎస్డీ కార్డుతో 1టిబి వరకు స్టోరేజ్ ను పెంచే ఎంపికతో ఇది 2 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ తో జత చేయబడింది. ఈ ఫోన్ వెనుక సింగల్ 8MP కెమెరా సెటప్ తో వస్తుంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 5MP సెల్ఫీ కెమెరా ఉంది.

4. మైక్రో మ్యాక్స్ ఇన్ 1బి (Buy Here)

మైక్రోమాక్స్ ఇన్ 1 బి 6.52-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది మరియు ఇది 20: 9 యాస్పెక్ట్ రేషియోతో HD + రిజల్యూషన్ టి ఉంటుంది. In 1b కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఇందులో 13MP + 5MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది మరియు ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంది.  In 1b ఫోన్ మీడియాటెక్ G35 ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. IN 1b 10W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు USB టైప్-సి పోర్టుతో వస్తుంది.

3. నోకియా సి3 (Buy Here)

రియల్ మీ C30 స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ ఫుల్ స్క్రీన్ ని 120Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ Unisoc T612 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 2GB/3GB ర్యామ్ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. రియల్ మీ C30 స్మార్ట్ ఫోన్ వెనుక కేవలం 8MP సింగల్ కెమెరాతో వస్తుంది. అలాగే, సెల్ఫీల కోసం ముందుభాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 10W సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగిఉంటుంది.

2. రియల్ మీ సి20 (Buy Here)

Realme C20 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.5 అంగుళాల పరిమాణం గల LCD మల్టి టచ్ డిస్ప్లేని HD+ పిక్సెల్స్ రిజల్యూషన్ మరియు చిన్న వాటర్ డ్రాప్ నాచ్ డిజైనుతో కలిగి వుంటుంది. C20 ఫోన్ మీడియాటెక్ హీలియో G35 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది.ఇది 2GB ర్యామ్ + 32GB స్టోరేజితో కూల్ బ్లూ మరియు కూల్ గ్రేయ్ కలర్ అప్షన్ లో లభిస్తుంది. ఈ ఫోన్ వెనుక కేవలం 8MP AI సింగిల్ కెమెరాని మాత్రమే అందించింది. C20 ఒక పెద్ద 5,000mAh బ్యాటరీతో వుంటుంది.

1. రెడ్ మీ 9ఎ (Buy Here)

షియోమి రెడ్‌మి 9A ఒక 6.53-అంగుళాల HD+ రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. Redmi 9A మీడియా టెక్ హెలియో జి 25 ప్రాసెసర్ యొక్క ఆక్టా-కోర్ సిపియుతో పనిచేస్తుంది మరియు 3 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ ఆప్షన్లతో జతచేయబడుతుంది. రెడ్‌మి 9 ఎ లో 13 ఎంపి కెమెరాని ఎఫ్ / 2.2 ఎపర్చరుతో, 5 ఎంపి సెల్ఫీ కెమెరా నాచ్ కటౌట్‌లో ఉన్నాయి. రెడ్‌మి 9A లో 5,000WAA బ్యాటరీ 10W రెగ్యులర్ ఛార్జింగ్ వేగంతో ఉంటుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo