20 వేల ధరలో బెస్ట్ గేమింగ్ ఫోన్స్

20 వేల ధరలో బెస్ట్ గేమింగ్ ఫోన్స్
HIGHLIGHTS

కేవలం ప్రీమియం ఫోన్లే కాదు, ఈ మధ్యస్థాయి ఫోన్లు కూడా గేమింగ్ అనుభూతిని అద్భుతంగా అందిస్తాయి.

PUBG గేమ్ 2018 వ సంవత్సరంలో అత్యంత జనాదరణ పొందిన వీడియో గేమ్ గా  నిలచింది, అంతే కాదు ఈ స్మార్ట్ ఫోన్ గేమ్ అల్ టైం హైయస్ట్ కూడా.  స్మార్ట్ ఫోన్ల ప్రోసెసింగ్ శక్తి,  అధిక గ్రాఫిక్స్ గేమును అందించడానికి మరియు స్మార్ట్ ఫోన్లు పోర్టబుల్ స్వభావంను కలిగి ఉండటం వలన, మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా గేమ్ ప్లే ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. అయితే, ఫోన్లలో భారీ ఆటలను ఆడటానికి, ప్రీమియం ఫోన్లు  ఎక్కువగా సిఫార్సు చేయబడతాయి. కానీ,  20,000 కంటే తక్కువ ధరలో ఉన్న కొన్ని స్మార్ట్ ఫోన్లు కూడా ఈ పనిని సాఫీగా నిర్వహించగలవు. 20,000 వేల రూపాయల కంటే తక్కువ ధరలో ఉత్తమ గేమింగ్ ఫోన్ల జాబితా ఇక్కడ మీ కోసం అందిస్తున్నాము.

 షావోమి Poco F1

 Poco F1 అనేది, మధ్యస్థ శ్రేణి వారికోసం తయారు చేయబడిన ఒక ప్రధాన ఫోన్. ఒక ప్రధాన Snapdragon 845 ప్రాసెసరుతో, ఈ Poco F1 మీకు ఎటువంటి  మొబైల్ గేమ్ అయినా సరే సులభంగా నిర్వహించగలుగుతుంది. ఇది అత్యధిక గ్రాఫిక్స్ మరియు ఒక ప్రత్యేక లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో వస్తుంది . దీనిలో  PubG మొబైల్ గేమ్ వంటివి సులభంగా ఆడుకోవచ్చు, మరియు మీరు ఎక్కువ సమయం వరకు  ప్లే చేసిన కూడా ఎటువంటి ఇబ్బదివుండదు.

 హానర్ ప్లే

 ఈ హానర్ ప్లే ఒక కిరిన్ 970 ప్రాసెసర్ మరియు హువాయ్ యొక్క GPU టర్బోతో,  PubG మొబైల్ వంటి పాపులర్  గేమ్ ను ఎటువంటి ల్యాగ్ లేకుండా ఇందులో ప్లే చేసుకోవచ్చు. ఇది చాలా సన్నగా మరియు ఆడుతున్నప్పుడు ఒక సౌకర్యవంతమైన గ్రిప్ ని మీకు ఇస్తుంది.

 రియల్మీ 2 ప్రో

 రియల్మీ 2 ప్రో స్మార్ట్ ఫోన్, Google PlayStore లో వుండే  ఎటువంటి గేమ్ అయినాసరే అమలు చేయడానికి తగినంత శక్తిని కలిగి ఉంది. ఇప్పటికీ వరకు  స్నాప్డ్రాగెన్ 660 ప్రాసెసర్ కోసం మద్దతునివ్వని ఫోర్ట్నైట్ గేమ్ మినహాయిస్తే , రియల్ 2 ప్రో ఫోన్ గేమ్స్ ప్లే చేయడానికి  ఒక మంచి మరియు సరసమైన స్మార్ట్ ఫోన్.

 ఆసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2

 రియల్మీ 2 ప్రో  ప్లే చేయగల ప్రతి గేమ్, ఈ ఆసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2 కూడా చక్కగా నిర్వహించగలదు. అలాగే ఇందులో ఇచ్చిన ఒక అతిపెద్ద  5,000 mAh బ్యాటరీకి నిజంగా మెచ్చుకోవచ్చు, ఇది మీకు ఎక్కువ సేపు గేమ్ ప్లే ఆనందించడానికి వీలు కల్పిస్తుంది.

 నోకియా 7.1

 నోకియా 7.1, తనలో  అత్యంత శక్తివంతమైన హార్డ్వేర్ను కలిగి ఉండకపోవచ్చు, కానీ ఇది HDR-తో వస్తుంది కాబట్టి,  ఇందులో గేమ్ ప్లే అనుభవాన్ని అందంగా  చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo