Rs.25,000 ధరలో బెస్ట్ Curved Display 5G ఫోన్ కోసం చూస్తున్నారా| Latest Tech News

Rs.25,000 ధరలో బెస్ట్ Curved Display 5G ఫోన్ కోసం చూస్తున్నారా| Latest Tech News
HIGHLIGHTS

Rs.25,000 ధరలో బెస్ట్ Curved Display ఫోన్స్

ఇండియన్ మార్కెట్ లో చాలా వేగంగా కొత్త ఫోన్లు లాంచ్ అవుతున్నాయి

Rs.25,000 ఉప ధరలో ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు లాంచ్ అవుతున్నాయి

ఇండియన్ మార్కెట్ లో చాలా వేగంగా కొత్త ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. అందులోనూ, Rs.25,000 ఉప ధరలో ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. ఈ బడ్జెట్ కేటగిరిలో విడుదలవుతున్న ఫోన్లలో ఎక్కువ శాతం Curved Display తో వచ్చే ఫోన్స్ అనే చెప్పాలి. అందుకే, ఈరోజు Rs.25,000 ధరలో బెస్ట్ Curved Display ఫోన్స్ లిస్ట్ మీ కోసం అందిస్తున్నాను. ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏమిటి చూసేద్దామా. 

Rs.25,000 ధరలో బెస్ట్ Curved Display ఫోన్స్ 

ఈ కేటగిరిలో అన్ని కంపెనీలు కూడా పోటాపోటీగా తమ కొత్త ఫోన్లను అందించాయి. అయితే, కస్టమర్ రివ్యూలను ఆధారంగా చేసుకొని ఈ లిస్ట్ ను అందించడం జరిగింది. 

1. iQOO Z7 Pro 5G

ధర రూ. 23,999

ఈ లేటెస్ట్ ఐకూ స్మార్ట్ ఫోన్ Rs.25,000 ఉప కేటగిరిలో 3D Curved AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ Dimesity 7200 5G ఫాస్ట్ ప్రోసెసర్, 64MP Aura Light OIS కెమేరా మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అందిస్తున్నట్లు Amazon నుండి 4.3/5 రేటింగ్ ను అందుకుంది. ఈ ఫోన్ డిస్ప్లే మరియు కెమేరా సిస్టమ్ గొప్పగా ఉన్నట్లు  ఫోన్ ఉపయోగిస్తున్న యూజర్లు కితాబు ఇస్తున్నారు. Buy From Here 

2. Lava Agni 2 5G

ధర రూ. 23,599

ఇండియన్ బ్రాండ్ Lava యొక్క లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Lava Agni 2 5G కూడా ఈ కేటగిరిలో నిలుస్తుంది. ఈ ఫోన్ 120 Hz Curved AMOLED డిస్ప్లేతో వస్తుంది మరియు Dimensity 7050 5G ప్రోసెసర్ జతగా 8GB+8GB వర్చువల్ RAM ఫీచర్ తో మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ డిజైన్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడా గొప్పగా ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ అమేజాన్ లో యూజర్ల నుండి 4.3 రేటింగ్ ను అందుకుంది. Buy From Here

3. vivo V29e 5G

ధర రూ. 26,999

వివో లేటెస్ట్ కర్వ్ స్మార్ట్ ఫోన్ vivo V29e 5G స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం బ్యాంక్ అఫర్ ధరతో 25 వేల ధరలో లభిస్తోంది. ఈ వివో స్మార్ట్ ఫోన్ 120Hz Slim 3D Curved Screen తో వస్తుంది మరియు చాలా ఆకర్షణీయమైన డిజైన్ తో మెరిసిపోతుంది. ఈ ఫోన్ లో 50 MP Eye AF Selfie మరియు 64 MP OIS మెయిన్ కెమేరా ఉన్నాయి. ఈ ఫోన్ బ్యాటరీ, కెమేరా, డిస్ప్లే మరియు డిజైన్ పరంగా మంచి రివ్యూలను అందుకుంది. Flipkart లో ఈ ఫోన్ యూజర్ల నుండి 4.4 ఓవరాల్ రేటింగ్ ను అందుకుంది. Buy From Here

4. Infinix Zero 30 5G  

ధర రూ. 23,999

ఇన్ఫినిక్స్ నుండి అంచనాలకు మించి వచ్చిన స్మార్ట్ ఫోన్ గా Infinix Zero 30 5G ఇప్పుడు పేరు సంపాదించుకుంది. Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ Flipkart పైన ఓవరాల్ 4.3 రేటింగ్ ను అందుకుంది. ఈ ఫోన్ వాల్యూ ఫర్ మని ఎక్కువ మంది యూజర్ల కితాబు అందుకుంది. ఈ ఫోన్ లో బిగ్ 3D Curved AMOLED డిస్ప్లే, ఫ్రెంట్ అండ్ బ్యాక్ 4K (60 FPS) వీడియో రికార్డ్ చెయ్యగల కెమేరాలు మరియు Dimensity 8020 ఫాస్ట్ 5G ప్రోసెసర్ తో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo