భారతదేశంలో కేవలం 7000 రూపాయల ధరలో, కొనుగోలుచేయదగిన 5 ఉత్తమ స్మార్ట్ ఫోన్లను ఇప్పుడు పరిశీలిద్దాం. ఇవి బడ్జెట్ ఫోన్లు అయినా కూడా మరిన్నిసరికొత్త ఫీచర్లతో పెర్ఫార్మెన్సులో రాజీపడవు. రూ .7000 బడ్జెట్ లో మొబైల్ కోసం చూస్తున్నవారిలో మీరు కూడా ఒకరైతే, మీరు ఈ స్మార్ట్ ఫోన్ల జాబితా, మీకు కచ్చితంగా సహాయపడుతుంది.
ఈ 7000 రూపాయల ధర పరిధిలోని, ఎంట్రీ లెవల్ లెవల్ ఫోన్లను 18: 9 డిస్ప్లేలు, మెటల్ బాడీ మరియు మరిన్ని ప్రత్యేకతలతో కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ జాబితాలో ఉత్తమమైన వాటిని ఇక్కడ 5స్థానం నుండి 1 వరకు వారసుమా క్రమంలో అందించాము.
5వ స్థానం: నోకియా 1
ఇది Android Oreo ఎడిషన్, ఎంట్రీ లెవల్ హార్డ్ వేరుతో సజావుగా నడుస్తుంది. దాని రూపకల్పన మరియు నిర్మాణం చాల బాగుంటుంది . HMD గ్లోబల్ ఆప్టికల్ స్పెక్ట్రంకు మార్చగలిగే ప్లాస్టిక్ బ్యాక్ కవర్లతో మంచి గ్రిప్పింగ్ అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
4వ స్థానం: 10.or E
ఈ ఫోనులోని ఫీచర్లు నిజంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో సాధ్యమమయ్యేలా అనిపించవు, ఎందుకంటే దాని 5.5 ఫుల్ HD డిస్ప్లే 1920x1080p | 2.5D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 వంటివి, ఈ ఫోనును ఆకర్షించేలా చేస్తాయి. అదనంగా మీరు ఒక 3930mAh లిథియం అయాన్ బ్యాటరీని దీనితో అందుకుంటారు. అలాగే, ఆటో ఫోకస్ జత తో 13MP వెనుక కెమెరా మరియు Selfie కోసం 5MP సెన్సార్ని తీసుకువస్తుంది.
3వ స్థానం: హానర్ 7S
13MP వెనుక కెమెరా మీకు అద్భుతమైన కెమెరా అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు మీ ప్రతి ఒక్క మూమెంట్ ని, క్షణాలలో సంగ్రహించడానికి అనుమతిస్తుంది. ఒక 5.45 అంగుళాల పూర్తి వీక్షణ డిస్ప్లే మరియు స్పష్టమైన వాల్యూమ్, మీకు సినిమాలు మరియు ఆడియో సమయంలో సరిపోతుంది. అంతేకాకుండా, మీ కాలింగ్ లేదా వీడియో కాళ్లలో కూడా చక్కని క్లారిటీ అందుకుంటారు.
2 వ స్థానం : ఆసుస్ Zenfone లైట్ L1
ఇది మీరు వీక్షించే సన్నివేశాలను, 1440x720p రిజల్యూషన్లో ఒక 5.45 హై డెఫినిషన్, ఫుల్ వ్యూ డిస్ప్లేలో ప్రదర్శిస్తుంది. కాబట్టి మీరు పదునైన మరియు స్పష్టమైన వీక్షనానుభూతిని పొందుతారు. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 3000 mAh బ్యాటరీతో ఒక రోజంతా కూడా మీకు కొనసాగుతుంది. ఇది మీకు Wi-Fi ని ఉపయోగించి 4-రోజుల మ్యూజిక్ ప్లేబ్యాక్ మరియు 17 గంటల వెబ్ బ్రౌజింగ్ వరకు అనుమతిస్తుంది.
1వ స్థానం: Xiaomi Redmi 6A
Xiaomi Redmi 6A శక్తివంతమైన లక్షణాలను తనలో ఇముడ్చుకుని, బడ్జెట్ పరిధిలో ఒక గొప్ప స్మార్ట్ ఫోనుగా మొదటి స్థానాన్ని కైవసంచేసుకుంది. బహుళ విధులను నిర్వహించడంలో ఈ స్మార్ట్ ఫోను యొక్క పనితీరు ఉత్తమంగా ఉంటుంది. అధిక నాణ్యత చిత్రాలను తీయడానికి మంచి కెమెరాలు కూడా ఇందులో ఉన్నాయి. మంచి బ్యాటరీ బ్యాకప్ ఈ ఫోను సొంతం. ఈ Xiaomi Redmi 6A కచ్చితంగా, రూ.7,000 ధర పరిధిలో ఒక పరిపూర్ణ స్మార్ట్ ఫోన్ ఎంపికగా ఉంటుంది.