జూన్ లో ఆసుస్ నుండి జెన్ ఫోన్ 3 సిరిస్ స్మార్ట్ ఫోన్స్

జూన్ లో ఆసుస్ నుండి జెన్ ఫోన్ 3 సిరిస్ స్మార్ట్ ఫోన్స్

ఆసుస్ జెన్ ఫోన్ 3 సిరిస్ లో స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ అవుతున్నాయి జూన్ లో. ఈ విషయాన్ని కంపెని సీఈఓ తెలిపారు. ఈ ఫోనులు మిడ్ రేంజ్ బడ్జెట్ లో ఉంటాయని రిపోర్ట్స్.

అయితే వీటి డిజైన్ లేదా హార్డ్ వేర్ విషయాలు మాత్రం ఇప్పటివరకు లీక్ కాలేదు. జెన్ ఫోన్ 3 ఫోన్స్ ఆగస్ట్ నెల లోపు మొత్తం 6 దేశాలలో సేల్స్ అవుతాయి అని తెలిపారు సీఈఓ.

90 శాతం వీటిలో స్నాప్ డ్రాగన్ ప్రొసెసర్ తో ఉండగా, 10 శాతం మీడియా టెక్ ప్రొసెసర్ తో రానున్నాయి జెన్ ఫోన్ 3 సిరిస్ ఫోన్స్. జెన్ ఫోన్ 2 లో కొన్ని మోడల్స్ ఇంటెల్ SoC లతో రాగా, అవి సక్సెస్ కూడా అయ్యాయి.

కాని రీసెంట్ గా ఇంటెల్  ఇక  atom మొబైల్ ప్రాసెసర్లను తయారు చేయదని వెల్లడించింది మొన్న. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం జెన్ ఫోన్ 3 ఫోన్లలో ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు USB టైప్ c పోర్ట్స్ ఉండనున్నాయి.

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo