ఆసుస్ లేటెస్ట్ గా తన "Zensation" ఈవెంట్ లో జెన్ వాచ్ 2 ను టైపేలో విడుదల చేసింది. మూడు కలర్స్ (రోజ్ గోల్డ్, సిల్వర్, గన్ మేటల్) , రెండు సైజుల్లో దొరకనున్న జెన్ వాచ్ 2 మెటల్ బిల్డ్ క్వాలిటీ తో ఉంది.
జెన్ వాచ్ 2 డిజైన్ ఆసుస్ మొదటి స్మార్ట్ వాచ్ వలె ఉంది. దీని ప్రధాన ఆకర్షణ మాగ్నెటిక్ చార్జింగ్ సెట్ అప్. ఇది ఫాస్ట్ గా చార్జింగ్ చేయటమే కాకుండా రిచార్జింగ్ టైంస్ ను కూడా పెంచనుంది అని అంటుంది ఆసుస్. ఆండ్రాయిడ్ లాలిపాప్ పై పనిచేస్తున్న ఈ వాచ్, క్వాల్ కామ్ Soc, అమోలేడ్ డిస్ప్లే, కర్వడ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఇంప్రూవ్డ్ వాటర్ మరియు డస్ట్ రెసిస్టన్స్ హంగులతో తో వస్తుంది. మొదటి జెన్ వాచ్ కు IP55 రేటింగ్ ఉండగా, ఆసుస్ వాచ్ 2 కి IP67 సుపిరియర్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంది.
ఆసుస్ దీని కోసం రెండు ఆప్స్ ను తయారు చేసింది. ఒకటి హెల్త్ ట్రాకింగ్ కోసం డెవెలప్ చేసిన, "Wellness" ఆప్. రెండవది, "Watch Face Land". వీటితో పాటు రిమోట్ కెమేరా వ్యూ ఫైండర్ అనే ఫీచర్ ను తెస్తుంది. దీనితో ఆసుస్ ఫోన్ లలో స్క్రీన్ పై ఫోటో తీయక ముందే దాని ప్రివ్యూ ను చూసే అవకాశం ఇస్తుంది ఇది.
18mm ఫిట్టింగ్ తో 45×37 mm చిన్న సైజు లో ఒక బ్యాండ్, 22mm ఫిట్టింగ్ లో 49×41 mm పెద్ద సైజు లో మరొక బ్యాండ్ దొరుకుతుంది. పెద్ద సైజు లో ఉన్న బ్యాండ్ వాచ్ ను చార్జింగ్ చేసేందుకు చిన్న బ్యాటరీ పవర్ ప్యాక్ తో కూడా వస్తుంది. ఇది కాకుండా ఆసుస్ వాచ్ మొత్తం 18 రకాల బిల్డ్ క్వాలిటిలతో (లెదర్, స్టెయిన్ లెస్ స్టీల్..etc) లభిస్తుంది అని చెబుతుంది ఆసుస్. అయితే స్మార్ట్ వాచ్ ప్రైసింగ్ కాని రిలీజ్ డేట్ కాని ఇంకా వెల్లడించలేదు ఆసుస్.
గత నెల ఏప్రిల్ లోనే ఆసుస్ స్టెయిన్లెస్ స్టిల్ బాడీతో 10 రోజుల పాటు బ్యాక్ అప్ ఇవ్వగలిగే VivoWatch ను అనౌన్స్ చేసింది. ఇది బ్లాక్ మరియు వైట్ కలర్స్ లో పవర్ సేవింగ్ డిస్ప్లే తో వస్తుంది. స్లీప్ ట్రాకింగ్ మరియు హార్ట్ రేట్ మానిటరింగ్ దీని ఫీచర్స్. పవర్ సేవింగ్ చేయగలిగే OS పై ఇది రన్ అవనుంది. కంపెని ప్రస్తుతం పవర్ సేవింగ్ OS పై పనిచేస్తున్నట్లు కూడా వెల్లడించింది. అయితే ఇది స్మార్ట్ వాచ్ లకు మాత్రమే.
ఆధారం: The Verge