Taiwanese స్మార్ట్ ఫోన్ బ్రాండ్, ఆసుస్ , Pegasus 2 ప్లస్ X550 పేరుతో కొత్త మిడ్ రేంజ్ మోడల్ ను లాంచ్ చేసింది.
దీనిలో స్నాప్ డ్రాగన్ 615 SoC ప్రొసెసర్, 3GB ర్యామ్, 1080P డిస్ప్లే, 13 మరియు 8MP కెమేరాస్, 3030 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1.1, డ్యూయల్ సిమ్ ఉన్నాయి.
గోల్డ్ మరియు వైట్ కలర్స్ లో వస్తుంది. స్పెక్స్ వైజ్ గా పేపర్ పై బాగుంది కాని దీని ధర ఎంత అనేదాని మీద దీని పై ఇంటరెస్ట్ చూపించాలి. ఇందులో వాడిన 615 ప్రొసెసర్ ఇంత వరకూ ఎటువంటి మంచి వ్యూస్ ను ఇవ్వలేదు. ఇదే ప్రొసెసర్ Xiaomi మి 4i లో ఉంది. బేసిక్ యూజర్స్ కి బాగుంటుంది కాని డి బెస్ట్ పెర్ఫర్మేర్ కాదు. అలాగే ఆసుస్ 13MP కెమేరా గతంలో జెన్ ఫోన్ 2 లో వాడింది. అది ఎవరేజ్ ఫోటోలను ఇస్తుంది.
సో 3GB ర్యామ్ ఒకటే ఇందులో రియల్ గా ఉపయోగపడే అవకాశం ఉంది. దీని ధర పై ఇంకా న్యూస్ రివీల్ చేయలేదు ఆసుస్.
ఇమేజ్ ఆధారం: Netease