ఈ రోజు ఇండియాలో అసుస్ అతిపెద్ద Zen ఫెస్టివల్ జరిగింది. ఈ ఈవెంట్ లో జెన్ ఫోన్ సేల్ఫీ, జెన్ ఫోన్ 2 లేజర్, జెన్ ఫోన్ Deluxe, జెన్ ప్యాడ్ 7.0 అండ్ జెన్ ప్యాడ్ 8.0 డివైజెస్ ను లాంచ్ చేసింది. వీటితో పాటు జెన్ ఫోన్ Max అనౌన్స్ చేసింది అసుస్.
అసుస్ జెన్ ఫోన్ సేల్ఫీ స్పెక్స్ – 13MP ఫ్రంట్ అండ్ రేర్ కేమేరాస్, 5.5 in HD డిస్ప్లే, 64 బిట్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 615 ప్రొసెసర్, 2gb/3gb ర్యామ్, 3,000 mah బ్యాటరీ, జెన్ ui తో లాలిపాప్, 16/32gb స్టోరేజ్ వేరియంట్స్ అండ్ 128 gb అదనపు స్టోరేజ్ సపోర్ట్. దీని ధర 15,999 రూ.
అసుస్ జెన్ ఫోన్ లేజర్ 2 స్పెక్స్ – 13MP లేజర్ ఆటో ఫోకస్ రేర్ కెమేరా. రెండు వేరియంట్స్ లో వస్తుంది మోడల్. 5.5 in FHD కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 410, 2gb/3gb ర్యామ్, 16 gb ఇంబిల్ట్ స్టోరేజ్. ఈ మోడల్ 2gb ర్యామ్ తో 9,999 రూ . 3gb ర్యామ్, స్నాప్ డ్రాగన్ 615 ప్రొసెసర్ తో 13,999 రూ లకు సేల్ అవుతుంది. 6 in డిస్ప్లే తో ఉన్నది 17,999 రూ లకు సేల్ అవనుంది.
జెన్ ఫోన్ 2 Deluxe స్పెక్స్ – ఇది సేమ్ జెన్ ఫోన్ 2 స్పెక్స్ తోనే వస్తుంది. కాకపోతే క్రిస్టల్ రేర్ కవర్ అండ్ multifaceted texture బాడీ తో వస్తుంది మొబైల్. 5.5 FHD డిస్ప్లే, క్వాడ్ కోర్ ఇంటెల్ Z3580 ప్రొసెసర్, 4gb ర్యామ్, 3,000 mah బ్యాటరీ, 13/5MP కెమేరాస్, PowerVR G6430 GPU లాలిపాప్. దీని ధర 22,999 రూ.
జెన్ ఫోన్ max స్పెక్స్ – 5000 mah బ్యాటరీ, 13MP లేజర్ ఆటో ఫోకస్ కెమేరా, 64 బిట్ స్నాప్ డ్రాగన్ 410 ప్రొసెసర్, 5mm thickness తో అక్టోబర్ లో లాంచ్ అవుతుంది మార్కెట్ లోకి ఫోన్. దీని ప్రైస్ పై యూజర్స్ ను సజెషన్స్ అడుగుతుంది అసుస్.
జెన్ ప్యాడ్ 8.0 స్పెక్స్ – 8 in HD IPS డిస్ప్లే, అసుస్ visual మాస్టర్ టెక్నాలజీ, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రొసెసర్ దీని ధర 14,999 రూ (without ఆడియో కవర్) మరియు 17,999 రూ (with ఆడియో కవర్)
జెన్ ప్యాడ్ 7.0 స్స్పెక్స్ – 7 in HD IPS డిస్ప్లే, 64 బిట్ ఇంటెల్ ఆటమ్ ప్రొసెసర్. ఇది విత్ ఆడియో కవర్(14,999 రూ) అండ్ విత్ ఔట్ ఆడియో కవర్(11,999 రూ) తో రెండు వేరియంట్స్ లో వస్తుంది. టాబ్లెట్ రెండు DTS HD సౌండ్ తో పార్టనర్ షిప్ అయ్యి వస్తున్నాయి.