ఆసుస్ ఇండియాలో 6 జెన్ ఫోన్ 3 సిరిస్ స్మార్ట్ ఫోనులను రిలీజ్ చేసింది
ఆసుస్ జెన్ ఫోన్ 3 సిరిస్ లో ఈ రోజు ఇండియాలో 6 స్మార్ట్ ఫోన్ మోడల్స్ రిలీజ్ అయ్యాయి. వీటితో పాటు జెన్ బుక్ 3 అండ్ Transformer 3 pro లాప్ టాప్స్ కూడా రిలీజ్ అయ్యాయి.
- రెండు స్టాండర్డ్ జెన్ ఫోన్ 3 – 5.2 in FHD డిస్ప్లే, 3GB ర్యామ్/32GB స్టోరేజ్ ( 21,999 రూ ) మరియు 5.5 in FHD డిస్ప్లే, 4GB ర్యామ్/64GB స్టోరేజ్ ( 27,999 రూ). ఈ రెండూ స్నాప్ డ్రాగన్ 625 ప్రొసెసర్, 16MP పిక్సెల్ మాస్టర్ 3.0 TriTech ఆటో ఫోకస్ రేర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, జెన్ UI 3.0 బేస్డ్ ఆండ్రాయిడ్ 6.0 OS. TriTech టెక్నాలజీ లేసర్, PDAF మరియు continous ఆటో ఫోకస్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తుంది ఫాస్ట్ ఫోకస్ గురించి.
రెండు జెన్ ఫోన్ డీలక్స్ – 5.7 in FHD సూపర్ అమోలేడ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 820 SoC, 6GB ర్యామ్, 23MP Sony’s IMX 318 సెన్సార్ 4-axis OIS పిక్సెల్ మాస్టర్ 3.0 అండ్ TriTech ఆటో ఫోకస్ రేర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 64GB స్టోరేజ్, 3000 mah బ్యాటరీ. దీని ప్రైస్ 49,999 రూ. ఇదే మోడల్ స్నాప్ డ్రాగన్ 821 SoC తో మరొక వేరియంట్ కూడా ఉంది. ఈ SoC తో ఇదే మొదటి ప్రొసెసర్. అదనంగా 256GB స్టోరేజ్ కూడా ఉంది. దీని ప్రైస్ 62,999 రూ.
ఒక జెన్ ఫోన్ 3 లేసర్ – 5.5 in FHD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 430 SoC, 4GB ర్యామ్, 13MP రేర్ లేసర్ ఆటో ఫోకస్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 32GB స్టోరేజ్, 3000 mah బ్యాటరీ, జెన్ UI 3.0. ప్రైస్ – 18,999 రూ క్రింద లేసర్ మోడల్ ఇమేజ్ చూడగలరు.
ఒక జెన్ ఫోన్ 3 అల్ట్రా – పెద్ద ఫుల్ HD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 652 SoC, 6GB ర్యామ్, 23MP TriTech ఆటో ఫోకస్ రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా, 64GB ఇంబిల్ట్ స్టోరేజ్, 4600 mah బ్యాటరీ అండ్ Hi-Res ఆడియో. దీని ప్రైస్ 49,999 రూ.