9,999 రూ స్టార్టింగ్ ప్రైస్ తో AsusMax upgraded మొబైల్స్ లాంచ్ ఇండియాలో

Updated on 23-May-2016

ఆసుస్ ఇండియాలో ఈ రోజు జెన్ ఫోన్ Max కొత్త అప్ గ్రేడేడ్ వెర్షన్ ను రిలీజ్ చేసింది. దీనిలో స్నాప్ డ్రాగన్ ఆక్టో కోర్ 615 SoC అండ్ 32GB ఇంబిల్ట్ స్టోరేజ్ యాడ్ అయ్యాయి.

కొత్త 2016 జెన్ ఫోన్ మాక్స్  రెండు వేరియంట్స్ లో వస్తుంది. ఒకటి 2GB ర్యామ్, మరొకటి 3GB ర్యామ్. రెండు వేరియంట్స్ లోనూ 32GB స్టోరేజ్ ఉంది.

2GB వేరియంట్ 9,999 రూ లకు ఫ్లిప్ కార్ట్ లో ప్రీ ఆర్డర్ చేసుకోగలరు. 3GB వేరియంట్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ అండ్ స్నాప్ డీల్ లో 12,999 రూ లకు సెల్ అవనుంది.

బ్లాక్ అండ్ వైట్ తో పాటు ఆరెంజ్ అండ్ బ్లూ కలర్స్ లో అందుబాటులోకి రానున్నాయి. ఇవి ఆసుస్ exclusive స్టోర్స్ అండ్ other రిటేల్ ఫిజికల్ స్టోర్స్ లో కూడా సెల్ అవుతాయి. అయితే టైమ్ పడుతుంది.

మిగిలిన స్పెక్స్ విషయానికి వస్తే 5.5 in HD డిస్ప్లే, 1.5Ghz ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 615SoC, 5000 mah బ్యాటరీ, 13MP డ్యూయల్ LED ఫ్లాష్ laser assisted ఆటో ఫోకస్, 5MP ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0.1 OS out of the బాక్స్, 32GB స్టోరేజ్ అండ్ 64GB sd కార్డ్ సపోర్ట్ ఉన్నాయి.

2016 జనవరి లో లాంచ్ అయిన మాక్స్ లో కూడా 5.5 in HD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 410 SoC, 5000 mah బ్యాటరీ, 5000 mah బ్యాటరీ, 16GB ఇంటర్నెల్ స్టోరేజ్ తో 9,999 రూ లకు సెల్ అయ్యింది.

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :