ఆపిల్ & సామ్సంగ్ కు స్పీడ్ టెస్ట్ కంపేరిజన్ లో ఆసక్తికరమైన రిసల్ట్
ఆండ్రాయిడ్ ఫాస్ట్ గా ఉంటుందా, ఆపిల్ ఐ OS ఫాస్ట్ గా ఉంటుందా అనేది ఎప్పటి నుండో ఉన్న డిబేట్. అయితే అడపాదడపా ఈ ప్రశ్నకు జవాబుగా ఆపిల్ విన్ అవటం చూసాము. ఒక సంవత్సరం ఓల్డ్ అయిన ఆపిల్ 6S తో సామ్సంగ్ వెరీ రీసెంట్ గెలాక్సీ నోట్ 7 మోడల్ ఓడిపోయింది రియల్ టైమ్ స్పీడ్ టెస్ట్ విషయంలో.
ఆపిల్ లోని ఫ్లాగ్ షిప్ మోడల్ ఆపిల్ ఐ ఫోన్ 6S మరియు ఆండ్రాయిడ్ లో రారాజు గా ఫాస్ట్ ఫోన్ గా గుర్తింపు ఉండే సామ్సంగ్ ఫ్లాగ్ షిప్ మోడల్ కు విడియో కంపేరిజన్ జరిగింది. మరొక సారి apple స్పీడ్ లో బెస్ట్ అని ప్రూవ్ అయ్యింది.
అసలు పెర్ఫార్మన్స్ లేదా స్పీడ్ అన్నప్పుడు, రియల్ టైమ్ స్పీడ్ అనేదే పట్టించుకోవలసిన అవసరం.రియల్ టైమ్ స్పీడ్ అంటే మీరు యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఓపెన్ అవ్వాలి. ఎంత త్వరగా ఓపెన్ అయ్యి – ఎంత త్వరగా పూర్తిగా లోడ్ అవుతుందో.. అదే బెస్ట్ స్పీడ్ ఉన్న ఫాస్ట్ ఫోన్ అని చెప్పాలి నా అభిప్రాయం లో. ఎందుకంటే మనకు డైలీ usage లో అవసరం ఉండే స్పీడ్ ఇదే.
సరే అసలు విషయానికి వస్తే youtube లో రెండు రోజుల క్రితం PhoneBuff చానెల్ కంపేరిజన్ చేసింది ఈ రెండు ఫ్లాగ్ షిప్ మోడల్స్ కు. వరుసగా 14 యాప్స్ ను రెండింటిలో ఓపెన్ చేయటం మరియు తిరిగి అవే యాప్స్ ను కంటిన్యూస్ గా ఓపెన్ చేసి చూడటం టెస్ట్. ఇది నిజంగా బెస్ట్ రియల్ టైమ్ టెస్ట్.
మొదటి సారి అన్ని 14 యాప్స్ ను ఓపెన్ చేసి మరియు కంప్లీట్ గా లోడ్ అయ్యేసరికి ఆపిల్ కు 1 నిమిషాన్ 21 సేకేండ్స్ పట్టింది. అవే 14 యాప్స్ ను నోట్ 7 లో ఓపెన్ చేసి కంప్లీట్ గా లోడ్ అవ్వటానికి 2 నిమిషాల 4 సేకేండ్స్ పట్టింది.
సో మరలా ఆపిల్ లో ఓపెన్ చేసి బ్యాక్ గ్రౌండ్ లో విడిచిపెట్టిన ఆ 14 యాప్స్ ను ఓపెన్ చేస్తే(మల్టీ టాస్కింగ్ టెస్ట్) 1 నిమిషం 51 సేకేండ్స్ టైం పట్టింది. సామ్సంగ్ నోట్ 7 కు 2 నిమిషాల 49 సేకేండ్స్ పట్టింది.
సో టోటల్ గా ఐ ఫోన్ 6S కు 1 మినిట్ 51 సేకేండ్స్ పడితే సామ్సంగ్ నోట్ 7 కు 2 మినిట్స్ 49 సేకేండ్స్ పట్టింది. ఆపిల్ లో సాఫ్ట్ వేర్ optimisation అనేది excellent. స్పెక్స్ తక్కువే ఉంటాయి కాని ఆ హార్డ్ వేర్ స్పెక్స్ కు OS కు మంచి tuning ఉంటుంది. ఆపిల్ బ్యాటరీ విషయంలో కొంచెం జాగ్రత్త పడితే ఫ్యూచర్ లో కాస్ట్ ఎక్కువైనా ఆపిల్ ఫోనులను ప్రిఫర్ చేస్తారాని అనుకోవచ్చు.
ఇక్కడ మీకు మరింత క్లారిటీ ఇవ్వటానికి కొన్ని పాయింట్స్…
1. ఆపిల్ ఐ ఫోన్ 6S సెప్టెంబర్ 2015 లో రిలీజ్ అయ్యింది. నోట్ 7 ఆగస్ట్ 2016 లో రిలీజ్ అయ్యింది. అంటే ఇదే నెలలో.
2. 6S లో A9 ప్రొసెసర్ మరియు 2GB ర్యామ్ ఉన్నాయి. నోట్ 7 లో స్నాప్ డ్రాగన్ 820 వెరీ లేటెస్ట్ ప్రొసెసర్ మరియు 4GB ర్యామ్ ఉన్నాయి. కేవలం యాప్ లోడింగ్(ప్రొసెసర్) వైజ్ గా ,మొదటి టెస్ట్ లోనే కాకుండా మల్టీ tasking(ర్యామ్ – రెండవ టెస్ట్) లో కూడా సగం ర్యామ్ ఉన్నా గెలిచింది.
3. 6S లో 1715 mAh Li-Po బ్యాటరీ ఉండగా, నోట్ 7 లో 3500 mAh Li-Po బ్యాటరీ ఉంది.
పైన మీకు వివరించిన కంపేరిజన్ యొక్క వీడియో ఈ క్రింద లింక్ లో చూడగలరు..