ఆపిల్ నెక్స్ట్ మోడల్ కు రౌండ్ ఫిజికల్ బటన్ ఉండదట

ఆపిల్ నెక్స్ట్ మోడల్ కు రౌండ్ ఫిజికల్ బటన్ ఉండదట
HIGHLIGHTS

అన్నీ ఫోన్ డిస్ప్లే లోనే ఉండనున్నాయట

aఆపిల్ ఫోనులు అంటే చాలా మందికి క్రేజ్. కాని ఆపిల్ వాటి ఫోన్ డిజైన్ పరంగా మాత్రం చాలా విమర్శలు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోనులు క్రింద మూడు ఫిజికల్ మరియు సాఫ్ట్ టచ్ బటన్స్ ను ఇస్తుంటే, ఆపిల్ మాత్రం ఒకే ఒక్క బటన్ ఇస్తుంది. ఇది కచ్చితంగా చాలా లిమిటెడ్ ఫంక్షన్స్ కు దరి తీస్తుంది. 

అయితే ఇప్పుడు ఆపిల్ ఈ బటన్ ను కూడా పూర్తిగా తీసివేయనుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. Digitimes report ప్రకారం ఆపిల్ టచ్ మరియు డిస్ప్లే డ్రైవర్ ను ఒక సింగిల్ చీప్ లో ఇంటిగ్రేట్ చేయనుంది. ఇది అల్ట్రా తిన్ డిజైనింగ్ కోసం చేస్తున్న మార్పు అని తైవాన్ డిజైన్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్నాయి.

కేవలం ఈ బటన్ ఉండటం వలన 4.7 in డిస్ప్లే ఉన్న ఐ ఫోన్ 6, 5.2 ఇంచ్ ఉన్న మోటో x 2nd Gen ఫోన్ కన్నా పెద్దదిగా ఉంటుంది మరియు 5.5 in డిస్ప్లే కలిగిన ఐ ఫోన్ 6 ప్లస్ 6in ఉన్న నెక్సాస్ 6 కన్నా పెద్దది గా అనిపిస్తుంది. ఇది ఫ్యూచర్ టెక్నాలజీ అని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒక కాన్సెప్ట్ ఇమేజ్ (పైన ఉంది) వచ్చింది. అయితే అది ఆపిల్ నుండి లేదా Digitimes రిపోర్ట్ నుండి లికైన ఇమేజ్ కాదు.

ఇది కనుక నిజం అయితే, ఆపిల్ టచ్ ID టెక్నాలజీ ఇక నుండి డిస్ప్లే నుండే వాడుకునే వీలు ఉంటుంది.

ఇమేజ్ సోర్స్ : Computer Bild

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo