“App Thinning” ఐ os 9 ది బెస్ట్ ఫీచర్

“App Thinning” ఐ os 9 ది బెస్ట్ ఫీచర్
HIGHLIGHTS

ఆప్ తిన్నింగ్ ఫీచర్ ద్వారా ఆప్స్ ను తక్కువ సైజు మరియు ఎక్కువ స్పీడ్ ఉంటాయి.

ఆండ్రాయిడ్ ఫోన్లలో కామన్ గా ఉండే ప్రాబ్లమ్ ఫోన్ ఎంత పెద్ద ప్రాసెసర్ మరియు ర్యామ్ లతో ఉన్నా అది ఎదో ఒక సందర్భంలో స్లో అవడం, మరీ ముఖ్యంగా మీరు రోడ్ల మీద, అర్జెంట్ విషయానికి ఫోన్ ను వాడుకుందాం అని అనుకున్నప్పుడు హాంగ్ అవ్వటం చేస్తుంది ఆండ్రాయిడ్. అయితే పెద్ద స్పెసిఫికేషన్స్ తో లేటెస్ట్ అంటూ ఆక్టో కోర్, డెకా కోర్, హెక్సా కోర్ ప్రాసెసర్స్ మరియు 3 జిబి, 4జిబి ర్యామ్ లు వస్తున్నా ఆండ్రాయిడ్ పూర్తి స్థాయిలో హై స్పీడ్ లో పనిచేయటంలేదు. ముఖ్యంగా ఆపిల్ ఫోన్ల కాన్నా స్పీడ్ గా ఉండటం అనేది అవాస్తవమే.

అయితే తాజాగా వచ్చిన సామ్సుంగ్ గేలక్సీ S6 మోడల్ ఒక్కటి మినహాయిస్తే మిగిలిన ప్రస్తుత ఆండ్రాయిడ్ ఫోనులన్నీ ఆపిల్ కన్నా బెటర్ మొబైల్స్ కావు పెర్ఫార్మెన్స్ మరియు ఇతర స్టాండర్డ్స్ విషయంలో. అయితే సామ్సంగ్ S6 కూడా చాలా సార్లు అప్లికేషన్ రన్నింగ్ లో ఇబ్బందులు వస్తున్నాయి. అంత అంత పెద్ద డబ్బులు పెట్టి అంతకుమించి హైప్ లు క్రియేట్ చేసి కంపెనీలు ఫోన్లు అమ్మటంతో పోల్చుకుంటే ఇలాంటి చిన్న చిన్న అప్లికేషన్ క్రషేస్ ను సీరియస్ గా తీసుకోవచ్చు.

ఇప్పటికే ఆండ్రాయిడ్ os కన్నా ఐ os స్పీడ్ విషయంలో ముందంజలో ఉంది. అయితే ఆపిల్ ఫోన్ పెర్ఫార్మెన్స్ ను సిరియస్ గా తీసుకునే స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఆనందించే  "App Thinning"  ఫీచర్ ఒకటి తీసుకువచ్చింది. ఆపిల్ సరికొత్త ఐos 9 అప్డేట్ కూడా 4.6 జిబి స్పేస్ నుండి 1.3 జిబి స్పేస్ ను వినియోగించనుంది. ఇది పెద్ద మార్పు. 8 జిబి, 16 జిబి స్టోరేజ్ ఉన్న ఐ ఫోన్ల యూజర్స్ కు ఎక్కువ స్పేస్ దొరుకుతుంది.

దీని ఉపయోగం: 
ఐ os 9 ను ఆపిల్ తన పాత ఐఫోన్ 4S పై కూడా విడుదల చేస్తుంది అనే విషయం మొత్తం ఆపిల్ 2015 WWDC లో ఒక హై లైట్ అని చెప్పవచ్చు. అన్ని లేటెస్ట్ ఫీచర్స్ ను ఒక ఓల్డ్ మరియు తక్కువ హార్డ్వేర్ ప్రాసెసర్, ర్యామ్ ఉన్న 4S పై రిలీజ్ చేయటం అనేది సింపుల్ కాదు. ఇందుకోసం ఆపిల్ "App Thining" ఫీచర్ ను ప్రవేసపెట్టింది. ఇది కేవలం తక్కువ హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్ ఉన్న ఐఫోన్ 4S కు మతమే కాదు, మొత్తం ఐ os 9 పై పనిచేయనున్న అన్ని ఐ os ఫోన్లకు వర్తించే ఫీచర్. 

ఒక ఆప్ డౌన్లోడ్ డేటా, ఆ డివైజ్ స్పెసిఫికేషన్ బట్టి డౌన్లోడ్ జరుగుతుంది ఈ ఫీచర్ వలన. అలాగే అప్లికేషన్ ను పూర్తిగా డౌన్లోడ్ చేయకుండా, అవసరం అయిన డేటా ను ముందు డౌన్లోడ్ చేసి, ఆ తరువాతి మిగిలిన అవసరం వస్తే అప్పుడు దానికి సంబందించిన డేటాను డౌన్లోడ్ చేసుకోవటానికి అవుతుంది.

అప్లికేషన్స్ సైజ్ లు తగ్గించి, రిసోర్స్ లను తక్కువుగా వాడుకొని ఎక్కువ స్పీడ్ తో పనిచేయతమే ఆప్ తిన్నింగ్ ఫీచర్ అంటే. ఇలాంటి ఫీచర్స్ మనం ప్రతీ మొబైల్ కొత్త os వెర్షన్ రిలీజ్ అప్పుడు చెప్పే ఫార్మల్ ఫీచర్స్ లాగ వినిపిస్తుంది కాని ఇది వాస్తవంలో పూర్తిగా బాగా ఎఫెక్ట్ చూపించనుంది. ఎందుకంటే ఐ os పై డెవలపర్ ఒక అప్లికేషన్ ను డెవలప్ చేయాలని అనుకుంటే డెవలపర్ ఆప్ తిన్నింగ్ వంటి అంశాలను పాటిస్తేనే ఆప్ డెవలప్ చేయగలరు. దీని వలన డెవలపర్స్ కచ్చితంగా ఆప్ తిన్నింగ్ కు అనువుగా, అనుగుణంగా అప్లికేషన్ తయారు చేయటం జరుగుతుంది. ఫలితంగా అప్లికేషన్ తక్కువ సైజు లో వచ్చి , ఇంబిల్ట్ స్టోరేజ్ లో తక్కువ స్పేస్ ను తీసుకోవటం జరుగుంటుంది, యూజర్ కు ఎక్కువ యూజబల్ స్పేస్ మిగులుతుంది మరియు అప్లికేషన్ ఎక్కువ రిసోర్స్ లను వాడకుండా చాలా లైట్ గా బ్యాక్ గ్రౌండ్ లో పనిచేస్తుంది, ఫలితంగా ఆప్ ఓపెన్ చేసేటప్పుడు, క్లోజ్ చేసేటప్పుడు, ముఖ్యంగా వాడుతునప్పుడు ఫోన్ ర్యామ్ మరియు ప్రాసెసర్ లను ఎక్కువుగా వాడకుండా మనం తెలుసుకోగలిగే అంత లైట్ వెయిట్ గా రన్ అవుతాది.

కేవలం స్మార్ట్ ఫోన్ లను పై కి అందంగా తయారు చేసి, పెద్ద పెద్ద స్పెసిఫికేషన్స్ ను జోడించి, కారులు కొనగలిగే మొత్తంలో సగం డబ్బులకు స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ os లో చాలా ఉన్నాయి. అయితే ఆండ్రాయిడ్ కూడా ఆపిల్ ఐ os వలె "App Thinning" వంటి సీరియస్ ఫీచర్స్ ను తీసుకు వస్తే, ఆండ్రాయిడ్ లో అప్లికేషన్స్ రిసోర్స్ లను ఎక్కువుగా తీసుకుంటుంది అనే నెగటివ్ ఫీడ్ బ్యాక్ నుండి బయట పడుతుంది. 

Souvik Das

Souvik Das

The one that switches between BMWs and Harbour Line Second Class. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo