ఆపిల్ 4 ఇంచ్ ఫోన్ పై మళ్ళీ వర్క్ చేస్తుంది అని రిపోర్ట్స్
లాస్ట్ ఇయర్ పెద్ద స్క్రీన్స్ కు వెళ్లిన ఆపిల్ మళ్ళీ 4in మోడల్ పై పనిచేస్తుంది.
చాలా కాలం గ్యాప్ తీసుకొని పెద్ద స్క్రీన్ మోడల్స్ ను దింపింది ఆపిల్ పోయిన సంవత్సరం. ఆపిల్ కు ఇష్టం లేనప్పటికీ మారుతున్న ట్రెండ్ వలన ఫోర్స్ గా 4.7 మరియు 5.5 in స్క్రీన్ లకు అపగ్రేడ్ చేసింది ఆపిల్ స్మార్ట్ ఫోన్ లను.
అయితే ఇప్పుడు మళ్ళీ ఆపిల్ పెద్ద స్క్రీన్ సైజు లతో పాటు 4in స్మార్ట్ ఫోన్ పై పనిచేస్తుంది అని వార్తలు వస్తున్నాయి. AIO డిస్ప్లే కంపెని ఆపిల్ కు స్మాల్ స్క్రీన్ ప్యానల్స్ ను సప్లై చేస్తుంది అని రిపోర్ట్స్. మిగిలిన కాంపో నేన్ట్స్ చైనా మరియు కొరియా నుండి దిగుమతి కానున్నాయి అట.
ఐ ఫోన్ 6S మిని పేరుతో విడుదల అవనుంది ఈ 4 in స్మార్ట్ ఫోన్. ఇది ఐ ఫోన్ 5C కు రిప్లేస్ మెంట్ గా ఉండనుంది. స్పెసిఫికేషన్స్ మాత్రం 5S మోడల్ కు దగ్గరగా ఉండనున్నాయి కాని బాడీ మరియు డిజైన్ మాత్రం 6 మరియు 6 ప్లస్ మోడల్ నుండి రానున్నాయి.
అయితే ఇవేవి ఆపిల్ నుండి వచ్చిన లీక్ లేదా అనౌన్స్ మెంట్స్ కావు. ఆపిల్ కు పార్ట్స్ ను అందించే సప్లై కంపెనీల నుండి వచ్చిన రూమర్స్. 4in మోడల్ తో పాటు మరో రెండు మోడల్స్ పై పనిచేయనుంది ఆపిల్. అలాగే 12.9 in లార్జర్ డిస్ప్లే ఐప్యాడ్ ప్రో పై కూడా ఆపిల్ వర్క్ చేస్తుంది. ఇది హై రిసల్యుషణ్ డిస్ప్లే మరియు A9 నెక్స్ట్ జెనరేషన్ ప్రాసెసర్ తో రానుంది.