అఫీషియల్ గా సొంతంగా Refurbished ఆపిల్ ఫోన్స్ సేల్స్ మొదలుపెట్టిన ఆపిల్
ఆపిల్ అఫీషియల్ గా కంపెని సొంత వెబ్ సైట్ లో Refurbished ఆపిల్ ఫోనులను అమ్ముతుంది ఇప్పుడు. Refurbished ఫోనుల గురించి తెలియదా? ఈ లింక్ లో మీకు refurbished ఫోన్ రివ్యూ తో పాటు కంప్లీట్ సమాచారం తెలియజేయటం జరిగింది. చూడగలరు!
అయితే ఇది ప్రస్తుతానికి కంపెని గ్లోబల్ సైట్(.com) లో ఉంది. ఇండియన్ సైట్ లో ఇంకా స్టార్ట్ కాలేదు. ఇండియన్ సైట్ లోకి ఎప్పుడు రానున్నాయి అనేది తెలియదు. 16GB refurbished ఐ ఫోన్ 6S ప్రైస్ – 449$(సుమారు 29 వేలు రూ) ఉంది. ఇదే ఫోన్ కొత్తది అయితే అదే సైట్ లో 36 వేలు రూ ఉంది సుమారు.
కొత్త ఫోనులతో పాటు refurbished ఫోనులను కూడా ఆపిల్ ఇలా స్వయంగా సేల్స్ చేయటం ఈ మొబైల్స్ పై ఎంత డిమాండ్ ఉందో తెలుస్తుంది. పైగా ఆపిల్ కు refurbishing కాన్సెప్ట్ సూట్ అవుతుంది.
ఎందుకంటే కొత్త ఫోనులు ప్రైస్ ఎక్కువ. సో refurbished మొబైల్స్ కొంచెం తక్కువ ప్రైస్ లో వస్తాయి. ఆల్రెడీ ఆపిల్ refurbished 6S ప్లస్ మరియు 6S ఫోనులను online స్టోర్ లో సేల్స్ కు పెట్టింది.
కేవలం ఐ ఫోన్స్ మాత్రమే కాదు ఆపిల్ లోని మాక్ లాప్ టాప్స్ మరియు ఇతర ఐటమ్స్ ను కూడా refurbish పద్దతిలో అమ్ముతుంది ఆపిల్. refurbished ఫోనుల unlocked గా వస్తాయి. అంటే ప్రపంచంలోని ఏ సిమ్ అనే వేసుకోగలరు.
refurbished ఐటమ్స్ అన్నీ టెస్ట్ చేసి, certified అయినవే అని చెబుతుంది ఆపిల్. పైగా కొత్త ఫోనుల వలె ఇవి కూడా వన్ ఇయర్ వారేంటి తో వస్తున్నాయి. బ్యాటరీ మరియు బయట బాడీ కూడా బ్రాండ్ న్యూ ఉంటుంది.
కాని కంపెని డైరెక్ట్ గా refurbishing సేల్స్ మొదలుపెట్టడం అనేది ఆపిల్ లవర్స్ కు మంచి శుభసూచకం. refurbishing online స్టోర్ త్వరలోనే ఇండియన్ సైట్ పై కూడా వస్తుంది అని అంచనా. ఈ లింక్ లో ఆపిల్ గ్లోబల్ సైట్ లో సెల్ అవుతున్న refurbished ఐటమ్స్ ను చూడగలరు.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile