apple launch event: ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. apple launch event ను సెప్టెంబర్ 7వ తేది న నిర్వహించనున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. యాపిల్ నిర్వహించే ఈ అతిపెద్ద ఈవెంట్ ద్వారా కొత్త ఐఫోన్ లను, అదేనండి iPhone 15 series నుండి అనౌన్స్ చేస్తుంది. వాస్తవానికి, యాపిల్ యొక్క ఈ అప్ కమింగ్ ఫోన్స్ గురించి కంపెనీ కంటే ఎక్కువగా మీడియా వర్గాలు ఉదరగొడతాయి. ప్రజలకు Apple iPhone ల మీద ఉన్న క్రేజ్ ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
apple launch event భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 12వ తేదీ రాత్రి 10:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ Apple Event ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అట్టహాసంగా జరగనున్నది.
apple launch event ను ప్రతీ ఒక్కరు LIVE లో చూడవచ్చు. ఈ కార్యక్రమం apple.com మరియు Apple TV app ద్వారా ప్రత్యక్ష ప్రసారం (LIVE) అవుతుంది. అంతేకాదు, యాపిల్ అధికారిక Youtube Channel ద్వారా కూడా ప్రసారం అవుతుంది.
Apple Event నుండి యాపిల్ యొక్క అప్ కమింగ్ ఫోన్ సిరీస్ అయిన iPhone 15 Series లను లంచ్ చేస్తుంది. యాపిల్ అప్ కమింగ్ ఫోన్ సిరీస్ iPhone 15 series ఫోన్స్ గురించి ఇప్పటికే అనేక రూమర్స్ మరియు ఎక్స్ పెక్టేడ్ ఫీచర్స్ గురించి నెట్టింట్లో పెద్ద చేర్చే నడుస్తోంది. iPhone 15 series స్మార్ట్ ఫోన్స్ పైన ఇప్పటి వరకూ వచ్చిన రూమర్స్ ప్రకారం, ఈ ఫోన్స్ భారీ ఫీచర్లతో లాంచ్ అవుతాయని మాత్రం ఎక్స్ పెక్ట్ చేయవచ్చు.
iPhone 15 series ఫోన్స్ మరింత అధిక ఖచ్చితమైన Low light కెమేరా పెర్ఫార్మెన్స్ తో వస్తాయని తెలుస్తోంది. ఈ అప్ కమింగ్ ఐఫోన్స్ లో A17 Bionic చిప్ సెట్ తో బ్లేజింగ్ పెర్ఫార్మెన్స్ అందించ గలవని ఇది iPhone 14 సిరీస్ కు భారీ అప్గ్రేడ్ అవుతుందని కూడా ఇంట్టింట్లో చర్చ జరుగుతోంది.
మరిన్ని ఎక్స్ పెక్టేడ్ ఫీచర్స్ గురించి కూడా నెట్టింట్లో చర్చ జరుగుతోంది. భారీ కెమేరా సెట్టింగ్ కి పెట్టింది పేరైన Apple యొక్క నెక్స్ట్ జెనరేషన్ ఫోన్స్ iPhone 15 series ఫోన్ లలో భారీ కెమేరా సెటప్ పాటుగా ఈసారి Periscope సెన్సార్ ఉండవచ్చని కూడా రూమర్స్ ఉన్నాయి. అంతేకాదు, ఇప్పటికే iPhone 15 series ఫోన్స్ ప్రొడక్షన్ ఇండియాలో మొదలైందని కూడా రిపోర్ట్ చెబుతున్నాయి.
https://twitter.com/gregjoz/status/1696558706857594970?ref_src=twsrc%5Etfw
అయితే, సెప్టెంబర్ 7వ తేది లాంచ్ సమయానికి ఈ ఫోన్స్ ఎలా ఉంటాయో వివరంగా తెలుస్తుంది.