నేటినుండి Apple iPhone XR ప్రీ ఆర్డర్స్ మొదలయ్యాయి

Updated on 19-Oct-2018
HIGHLIGHTS

న్యూరల్ ఇంజిన్ A12 బయోనిక్ చిప్ మరియు ఒక 6.1 అంగుళాల డిస్ప్లే తో వస్తుంది.

ఐఫోన్ XS మరియు XS మాక్స్ తో పాటుగా విడుదలయ్యి, చౌకైన ఫోనుగా పేర్కొన్నఆపిల్ ఐఫోన్ XR  ప్రీ- అర్దర్లకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ యొక్క ప్రీ అర్దర్లు ఈరోజు నుండి మొదలయ్యాయి. ఈ ఫోన్ Rs. 76,900 ధరతో ప్రారంభమవుతుంది, ఇది 64/128/256 GB స్టోరేజి ఎంపికలతో ఎంచుకోవచ్చు. ఈ ఫోన్ 1792 x 828 పిక్సెల్స్ గల ఒక 6.1 అంగుళాల IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే లిక్విడ్ రెటీనా HD సాంకేతికతతో ఉంటుంది. అలాగే,  A12 బయోనిక్ చిప్ న్యూరల్ ఇంజిన్ తో వస్తుంది మరియు IP67 రేటింగ్తో ఉంటుంది.  అంటే,  తుంపర్లు, నీరు మరియు డస్ట్ నుండి తట్టుకునేదిగా ఉంటుందన్నమాట.

1. Apple iPhone XR  64GB వేరియంట్ ధర – Rs. 76,900

2. Apple iPhone XR  128GB వేరియంట్ ధర – Rs. 81,900  

3. Apple iPhone XR  256GB వేరియంట్ ధర – Rs. 91,900

ఆపిల్ యొక్క ఆన్లైన్ భాగస్వాములు మరియు ఆఫ్ లైన్ స్టోర్ల ద్వారా, ఈ స్మార్ట్ ఫోన్ అక్టోబర్ 26 నుండి అమ్మకానికి ఉంటుంది. అయితే ఈరోజు నుండి దీని ప్రీ ఆర్దర్లు చేయవచ్చు.

కెమేరా విభాగానికి వస్తే, వెనుక f /1.8 ఆపేర్చేరు గల ఒక 12MP కెమెరాని కలిగిఉంటుంది. ఇది 6 ఎలిమెంట్ లెన్స్ తో వస్తుంది మరియు 5X జూమ్ కూడా చేయవచ్చు.  పనోరమా, బొకే మరియు పోర్ట్రైట్ వంటి అనేక ప్రత్యేకతలతో ఉంటుంది. ముందుభాగంలో,  f /2.2 ఆపేర్చేరు గల ఒక 12MP కెమెరాని కలిగిఉంటుంది  దీనితో 3X జూమ్ కూడా చేయవచ్చు.  పనోరమా, బొకే, పోర్ట్రైట్ అనిమోజీ మరియు మెమోజి వంటి అనేక ప్రత్యేకతలతో ఉంటుంది. ఈ ఐఫోన్ XR పేస్ అన్లాక్ సపోర్ట్ తో వస్తుంది మరియు iOS 12 తో నడుస్తుంది.

 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :