ఐ ఫోన్ 7 రిలీజ్ డేట్ ను అఫీషియల్ ను వెల్లడించింది ఆపిల్. సెప్టెంబర్ 7 న ఆపిల్ ఈవెంట్ ఉన్నట్లు ఇన్విటేషన్స్ పంపటం జరిగింది మీడియా కు. ఈవెంట్ లో ఐ ఫోన్ 7 మరియు ఐ ఫోన్ 7 ప్లస్ రిలీజ్ అవుతాయి అని అంచనా.
అంచనా ఏంటి కన్ఫర్మ్ కాదా అనుకోకండి! కంపెని ప్రతీ సంవత్సరం ఇన్విటేషన్స్ పంపుతుంది కాని ఈవెంట్ లో ఏమి రిలీజ్ చేయనుంది అని తెలపదు. san francisco లో ఈవెంట్ జరగనుంది.
ఐ ఫోన్లతో పాటు ఆపిల్ Watch 2 కూడా రిలీజ్ అవుతుంది అని అంచనా. అయితే ఇవి ఇండియన్ మార్కెట్ లోకి దీపావళి సీజన్ లో వస్తాయని తెలుస్తుంది.
ఆపిల్ 2017 కు 10 ఇయర్స్ పూర్తీ చేసుకోనుంది. సో ఈ ఇయర్ కన్నా వచ్చే సంవత్సరం ఎక్కువ changes తో కొత్త మోడల్ ను రిలీజ్ చేస్తుంది అని కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. సో ఐ ఫోన్ 7 తో పాటు వస్తున్న మార్పులు మరియు ఫీచర్స్(రిపోర్ట్స్)..
32GB వేరియంట్ ఐ ఫోన్ 7 ప్రైస్ సుమారు 53,000 రూ మరియు ఐ ఫోన్ 7 ప్లస్ 32GB వేరియంట్ 61,000 ఉంటుంది అని అంచనా.
US లో సెప్టెంబర్ 16 నుండి సేల్స్ స్టార్ట్. సెప్టెంబర్ 23 నుండి carrier నెట్ వర్క్స్ ఒప్పందాలతో locked హ్యాండ్ సెట్స్ అందుబాటులోకి వస్తాయి.
ఆపిల్ రీసెంట్ గా లాంచ్ చేసిన ఐ ఫోన్ SE కొనాలా వద్దా అనే దానిపై చిన్న ఒపీనియన్ వీడియో చేయటం జరిగింది తెలుగులో క్రింద చూడగలరు..డిజిట్ తెలుగు ఎడిటర్ ఫేస్ బుక్ ప్రొఫైల్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.