మార్చ్ 22 ఆపిల్ నుండి ఐ ఫోన్ 5SE పేరుతో కొత్త మోడల్ లాంచ్?

Updated on 26-Feb-2016

ఆపిల్ మార్చ్ 22 న ఈవెంట్ చేయనుంది అని రిపోర్ట్స్. సౌత్ కొరియన్ వెబ్ సైట్ – UnderKG రిపోర్ట్స్ ప్రకారం ఆపిల్ ఈవెంట్ ను మార్చ్ 22 కు వాయిదా వేసింది.

గతంలో ఇదే ఈవెంట్ మార్చ్ 15 న జరపనుంది ఆపిల్ అని రిపోర్ట్స్ వచ్చాయి. ఈ ఈవెంట్ పై ఎందుకు అన్ని రిపోర్ట్స్ అంటే కంపెని ఈ స్టేజ్ పై ఐ ఫోన్ 5SE పేరుతో కొత్త మోడల్ ను లాంచ్ చేస్తుంది అని రూమర్స్.

ఇది 4 in స్క్రీన్ తో వస్తుంది. దీనితో పాటు ఐ pad ఎయిర్ 3 కూడా కంపెని అనౌన్స్ చేయనుంది. 9to5mac మాత్రం 9.7 in ఐపాడ్ ప్రో ను లాంచ్ చేస్తుంది ఆపిల్ అని చెబుతుంది.

ఇంతకుముందే దీనిలో క్వాడ్ స్పీకర్ సెట్ అప్ మరియు సొంత స్మార్ట్ accessories ను సపోర్ట్ చేసే స్మార్ట్ connecter ఉండనున్నట్లు ఐపాడ్ ఎయిర్ 3 ఇమేజ్ ఒకటి ఇంటర్నెట్ లో హాల్ చల్ చేసింది.

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :