Apple iPhone 16 Pro మరియు iPhone 16 Pro Max ఇండియా ప్రైస్ మరియు ఫీచర్లు తెలుసుకోండి.!

Updated on 10-Sep-2024
HIGHLIGHTS

Apple iPhone 16 Pro మరియు iPhone 16 Pro లను ఈరోజు లాంచ్ చేసింది

ఈ రెండు ఫోన్లు కూడా పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు నమ్మలేని కెమెరా ఫీచర్స్ తో లాంచ్ చేసింది

ఈ ఫోన్ A17 Bionic Pro చిప్ సెట్ కంటే 37% వేగంగా ఉంటుంది

Apple iPhone 16 Pro మరియు iPhone 16 Pro ఫోన్ లను ఈరోజు లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు కూడా పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు నమ్మలేని కెమెరా ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ కొత్త యాపిల్ 16 ప్రో సిరీస్ ఫోన్లను అద్భుతమైన సౌండ్ రికార్డింగ్ సెట్టింగ్స్ మరియు మరిన్ని ఆశ్చర్యకరమైన ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ కొత్త యాపిల్ ఫోన్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దామా.

Apple iPhone 16 Pro మరియు iPhone 16 Pro : ఫీచర్స్

యాపిల్ ఈ రెండు ఫోన్ లను కూడా A18 Bionic Pro chip తో లాంచ్ చేసింది ఈ చిప్ సెట్ 6‑core CPU, 6‑core GPU మరియు 16 కోర్ న్యూరల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఫోన్ A17 Bionic Pro చిప్ సెట్ కంటే 37% వేగంగా ఉంటుంది. ఈ రెండు ఫోన్స్ స్క్రీన్ సైజులో మాత్రం తేడా ఉంటుంది. ఐఫోన్ 16 ప్రో ఫోన్ ను 6.3 ఇంచ్ Super Retina XDR స్క్రీన్ తో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్ ను మాత్రం ఎన్నడూ లేని విధంగా 6.9 ఇంచ్ స్క్రీన్ తో అందించింది.

ఈ ఫోన్ స్క్రీన్ మరింత పటిష్టంగా ఉండే సిరామిక్ షీల్డ్ తో వస్తాయి. ఈ స్క్రీన్ అవుట్ డోర్ లో 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 1600 (HDR) నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్ తో స్ప్లాష్, వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్లు Dolby Vision, HDR10+/HDR10 మరియు HLG సపోర్ట్ లతో వస్తాయి.

ఈ రెండు ఫోన్ లలో కూడా నిజంగానే ప్రో కెమెరా సిస్టం అందించింది. ఐఫోన్ 16 ప్రో సిరీస్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. ఇందులో 48MP ఫ్యూజన్, 48MP అల్ట్రా వైడ్ మరియు 12MP (12X ఆప్టికల్ జూమ్) సెన్సార్ లను అందించింది. ఈ ఫోన్ కెమెరాతో Dolby Vision 4K వీడియోలు 120FPS వద్ద షూట్ చేయవచ్చని యాపిల్ సగర్వంగా విన్నవించింది. అంతేకాదు, ఇందులో 48MP మ్యాక్రో ఫోటోగ్రఫీ మరియు Smart HDR 5 వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ పాటు యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది.

ఈ ఫోన్ లో శాటిలైట్ ఆధారిత Emergency SOS, Messages మరియు Find My సపోర్ట్ లను అందించింది. అంటే, ఫోన్ నెట్ వర్క్ లేకపోయినా ఈ మూడు పనులు శాటిలైట్ సహాయంతో చేస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్ లో క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ను కూడా కలిగి వుంది.

యాపిల్ ఐఫోన్ 16 ప్రో సిరీస్ ఫోన్ లలో కొత్త Voice Isolation మరియు Wide Spectrum microphone మోడ్ ఫీచర్ లను అందించింది. ఈ ఫోన్స్ FLAC, Dolby Digital, Dolby Digital Plus మరియు Dolby Atmos సపోర్ట్ తో వస్తాయి. ఇది టైప్ C పోర్ట్, MagSafe వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ మరియు Qi2 ఛార్జ్ సపోర్ట్ తో కూడా వస్తుంది.

Also Read: Apple iPhone 16 మరియు iPhone 16 Plus లను యాపిల్ ఇంటెలిజెన్స్ తో లాంచ్ చేసింది.!

Apple iPhone 16 Pro : ధర

  • యాపిల్ ఐఫోన్ 16 ప్రో : 128GB వేరియంట్ ధర : రూ. 1,19,900
  • యాపిల్ ఐఫోన్ 16 ప్రో : 256GB వేరియంట్ ధర : రూ. 1,29,90
  • యాపిల్ ఐఫోన్ 16 ప్రో : 512GB వేరియంట్ ధర : రూ. 1,49,900
  • యాపిల్ ఐఫోన్ 16 ప్రో : 1TB వేరియంట్ ధర : రూ. 1,69,900

Apple iPhone 16 Pro Max: ధర

  • యాపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ : 256GB వేరియంట్ ధర : రూ. 1,44,900
  • యాపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ : 512GB వేరియంట్ ధర : రూ. 1,64,900
  • యాపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ : 1TB వేరియంట్ ధర : రూ. 1,84,900

ఈ యాపిల్ ఫోన్ లు డిజర్ట్ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం మరియు బ్లాక్ టైటానియం నాలుగు కలర్ లలో లభిస్తుంది. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి ఈ కొత్త ఐఫోన్ ఫోన్స్ ప్రీ ఆర్డర్స్ మొదలవుతాయి. అలాగే, సెప్టెంబర్ 20 వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :