ఆపిల్ యొక్క2018 ఐఫోన్ OLED ఐఫోన్ తరువాత LCD డిస్ప్లేతో కూడిన ఐఫోన్ మార్కెట్ ను తాకనుంది :రిపోర్ట్

Updated on 30-Jul-2018
HIGHLIGHTS

డిస్ప్లేలో తలెత్తిన "లైట్ లీకేజీ " సమస్య కారణంగా ఈ ఆలస్యం జరిగిందని , అక్టోబర్ నెలలో ఈ ఫోన్ ని భారీ స్థాయి లో ఉత్పత్తి చేయనున్నారని ఒక నివేదిక లో పేర్కొన్నారు

ఐఫోన్ యొక్క న్యూ -జెనరేషన్ ఫోన్ గురించిన ఊహాగానాలను పటాపంచలు చేస్తూ ఆపిల్ ఈ సంవత్సరంలో మూడు ఐ ఫోన్ మోడల్స్ ను విడుదల చేయాలనీ  అంచనా వేస్తుంది ఇందులో ; రెండు మోడల్స్ ను OLED ప్యానెల్ తోనూ ఒక మోడల్ ని LCD డిస్ప్లేతోనూ అందించనుంది . ఆపిల్ అనలిస్ట్ అయినటువంటి మింగ్ చి కువో ముందుగా తెలిపిన విధంగా OLED యొక్క రెండు మోడల్స్ కూడా , 5.8-ఇంచ్ ఐ ఫోన్ మరియు 6.5-ఇంచ్ ఐఫోన్ ప్లస్ వేరియెంట్ గా అనుకున్న సమయానికి అందుబాటులో ఉండనున్నాయి, కానీ LCD మోడల్ మాత్రం నవంబర్ లో విడుదల కానుంది. అదే క్రమంలో ఒక కొత్త నివేదిక ప్రకారం, ఐఫోన్ యొక్క 'అత్యంత సరసమైన'  ఈ మూడు రకాల ఫోన్ల ను అక్టోబర్ నెల నుంచి భారీ ఉత్పత్తి చేయనున్నారని తెలుస్తుంది.

"మేము ప్రస్తుతం రాబోయే ఆపిల్ యొక్క ప్రధాన ఉత్పత్తులైన 5.8-ఇంచ్ లేదా 6.5-ఇంచ్ OLED ఐఫోన్ విడుదలలో ఆలస్యం కాకుండా చూస్తున్నాము .అయితే LCD మోడల్ ఉన్న బ్యాక్ లైట్ లీకేజి కారణంగా 6.1-ఇంచ్ LCD ఐఫోన్ భారీ ఉత్పత్తి కి మాత్రం ఒక నెల ఆలస్యం జరగవచ్చు " , అని మోర్గాన్ స్టాన్ లే  అనలిస్ట్ అయినటువంటి కేటీ హూబర్టీ నిర్ధారించినట్లుగా చెప్పారు .

 ఇదే రిపోర్ట్ ఇంకా ఏంచెబుతుందంటే ఆపిల్ తన కొత్త డివైజ్ లో పంపిణీ దారులకు  ఏవిధమైన సమస్యలు తలెత్తకుండా ముందుజాగ్రత్తలు తీసుకుందని "ముందుగా సూచించిన  6 -వారాల గా వున్నా ఉత్పత్తి  సమయాన్ని కుదించి దీన్ని 4-వారాలకు కుదించామని "   హూబర్టీ తెలిపారు .

ఇది ఫోన్ ను సమీకరించే భాగస్వాములు మరియు  ఆపిల్ పంపిణి దారులకు సమస్యగా మారింది ఎందుకంటే సెలవు సీజన్ రాక ముందే  ఉన్న అతి తక్కువ సమయంలో  తమ ఈ భారీ ఉత్పత్తిని అందించాల్సి ఉంటుంది . గడిచిన సంవత్సరం , ఐఫోన్ మరియు ఐఫోన్ 8 ప్లస్ లను సెప్టెంబర్ లోనే రవాణా చేయడం మొదలుపెట్టారు  కానీ ఐఫోన్ X మాత్రం నవంబర్ లో అందుబాటులోకి వచ్చింది.

  డిస్ప్లేలో తలెత్తిన  "లైట్ లీకేజీ " సమస్య కారణంగా LCD ఐఫోన్ మోడల్ ఉత్పత్తిలో ఆలస్యం జరిగిందని  ఈ నివేదిక తెలియచేసింది .అన్నిఫోన్ల LCD రూపకల్పన లో ఉన్న ఇబ్బందుల్ని కూపర్టినో-బేస్డ్ దిగ్గజం సరిచేయడానికి సమయం పట్టడంవల్ల ఇలాజరిగింది. అంతేకాకుండా LCD ప్యానల్ నోచ్ గా మలచడానికి  కొన్ని పరిధులు కలిగి ఉంటుందని OLED లాగా సులభంగా కత్తిరించడానికి , వంచడానికి మరియు బ్యాక్ లైట్ సహాయం లేకుండా పనిచేయడాని దీనిలో  వీలుండదని తెలియవచ్చింది. "LCD పనిచేయడానికి బ్యాక్ లైట్ కావాలని ,గిన్ద్రని మూలలు కలిగిన ఎడ్జ్ నుండి ఎడ్జ్  వరకు డిస్ప్లే ని వాడుకునే విధంగా మరియు పైభాగంలో కటవుట్ భాగాన్ని ఇవ్వడం చాల కష్టమని నివేదికలో వివరించింది.

ఇంతకుముందు ,మేము అందించిన నివేదిక ప్రకారంగానే జపాన్ – ఆధారిత కంపెనీ అయినటువంటి  నిచియా  6.1-ఇంచ్ ఐఫోన్ యొక్క బాటమ్ బెజెల్ సన్నగా ఉంచడం కోసం దాని ప్యానల్ అయిన  LTPS -LCD  యొక్క బ్యాక్ లైట్ లో ఉపయోగపడే  0.3టి LED చిప్స్ ను ప్రత్యేక సరఫరా చేస్తుంది.

6. 5-ఇంచ్ OLED "ఐఫోన్ X ప్లస్"  కోసం $900-$1,000, ఒక రెండో జనరేషన్ OLED ఐఫోన్ X  కోసం $800-$900 మరియు ఒక కొత్త 6.1-ఇంచ్ LCD ఐఫోన్ లను ఆపిల్ ఈసంవత్సరం మూడు ఐఫోన్ మోడల్స్ గా  విడుదల చేయాలనీ చూస్తుందని అంచనా. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :