Apple Event 2024 ఈవెంట్ డేట్ వచ్చేసింది .. iPhone 16 Series లాంచ్ చేసే పనిలో యాపిల్.!

Updated on 27-Aug-2024
HIGHLIGHTS

యాపిల్ బిగ్ లాంచ్ ఈవెంట్ Apple Event 2024 ను ప్రకటించింది

ఈ ఈవెంట్ నుంచి iPhone 16 Series తో పాటు మరిన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేసే అవకాశం

యాపిల్ ఈవెంట్ 2024 సెప్టెంబర్ 9 వ తేదీన జరుగుతుంది

Apple Event 2024: ప్రతి సంవత్సరం మాదిరిగానే యాపిల్ బిగ్ లాంచ్ ఈవెంట్ ను ప్రకటించింది. ఈ లాంచ్ ఈవెంట్ డేట్ ను కూడా యాపిల్ ప్రకటించింది. ఈ ఈవెంట్ నుంచి iPhone 16 Series తో తో పాటు మరిన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేసే అవకాశం వుంది. ఈ ఈవెంట్ నుంచి యాపిల్ ఏ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తుంది మరియు ఈ ఈవెంట్ నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉందో చూద్దాం.

Apple Event 2024 డేట్ ఏమిటి?

యాపిల్ ఈవెంట్ 2024 సెప్టెంబర్ 9 వ తేదీన భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు మొదలవుతుంది. కాలిఫోర్నియాలోని క్యూపర్టినో లో ఉన్న యాపిల్ హెడ్ క్వార్టర్స్ లో ఈ ఈవెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్ నుంచి ఐఫోన్ 16 సిరీస్ తో పాటు స్మార్ట్ వాచ్ మరియు మరిన్ని ప్రొడక్ట్స్ ను లాంచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

iPhone 16 Series : అంచనా ఫీచర్స్

ఐఫోన్ 16 సిరీస్ నుంచి యాపిల్ ఐఫోన్ 16 మరియు ఐఫోన్ 16 ప్లస్ లాంచ్ చేసే అవకాశం వుంది మరియు ఈ ఫోన్ ఎక్స్ ఎక్స్ పెక్ట్ ఫీచర్ల పై ఒక లుక్కేద్దాం. ఐఫోన్ 16 మరియు ఐఫోన్ 16 ప్లస్ రెండు ఫోన్లు కూడా A18 Bionic చిప్ సెట్ జతగా 8GB RAM తో రావచ్చని అంచనా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. వీటిలో ఐఫోన్ 16 ఫోన్ 6.1 ఇంచ్ స్క్రీన్ తో, ఐఫోన్ 16 ప్లస్ ఫోన్ 6.7 ఇంచ్ స్క్రీన్ తో ఉండవచ్చు.

ఐఫోన్ 16 సిరీస్ కెమెరా సెటప్ గురించి కూడా ముందు నుంచి రూమర్లు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్ల ప్రకారం, ఐఫోన్ 16 మరియు 16 ప్లస్ రెండు ఫోన్ లలో కూడా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48MP ప్రధాన కెమెరా మరియు జతగా అల్ట్రా వైడ్ కెమెరాతో ఉంటుందని అంచనా రూమర్ వుంది.

ఐఫోన్ 16 మరియు 16 ప్లస్ బ్యాటరీ గురించి కూడా వివరాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అదేమిటంటే, ఐఫోన్ 16 ఫోన్ లో 3,561mAh బ్యారీ ఉంటుంది మరియు 16 ప్లస్ ఫోన్ లో 4,006 mAh బ్యాటరీ ఉంటుందని ఊహిస్తున్నారు.

Also Read: లేటెస్ట్ LG Smart Tv మంచి డిస్కౌంట్ తో రూ. 11,999 ధరకే ఈరోజు లభిస్తోంది.!

iPhone 16 Pro మరియు Pro Max : అంచనా ఫీచర్స్

ఇక ఐఫోన్ 16 సిరీస్ ప్రీమియం ఫోన్స్ అయిన ఐఫోన్ 16 ప్రో మరియు 16 ప్రో మ్యాక్స్ ఫోన్స్ విషయానికి వస్తే, ఈ రెండు ఫోన్స్ కూడా A18 Pro చిప్ సెట్ తో రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48MP మెయిన్ కెమెరా, 5X ఆప్టికల్ జూమ్ కలిగిన 12MP టెలిఫోటో, 48MP అల్ట్రా వైడ్ కెమెరా ఉండవచ్చని ఊహిస్తున్నారు.

ఎప్పటి మాదిరిగానే యాపిల్ సరికొత్త ఫీచర్స్ మరియు వివరాలతో కొత్త ఫోన్ లను విడుదల చేస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :