ఇండియాలో రేపటి నుండి మొదలుకానున్న ఆపిల్ యొక్క సరసమైన ఫోన్ iPhone XR ప్రీ – ఆర్దర్లు
Rs.76, 900 ధరతో A12 బయోనిక్ చిప్ మరియు 12MP రియర్ కెమేరాతో వస్తుంది.
ఐఫోన్ XS మారియు XS మాక్స్ తో పాటుగా విడుదలైన, ఆపిల్ యొక్క సరసమైన ఫోన్ ఐఫోన్ XR ఇపుడు ప్రీ- అర్దర్లకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ యొక్క ప్రీ అర్దర్లు రేపటి నుండి మొదలు కానున్నాయి. ఈ ఫోన్ Rs. 76,900 ధరతో ప్రారంభమవుతుంది, ఇది 64/128/256 GB స్టోరేజి ఎంపికలతో ఎంచుకోవచ్చు. ఈ ఫోన్ 1792 x 828 పిక్సెల్స్ గల ఒక 6.1 అంగుళాల IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే లిక్విడ్ రెటీనా HD సాంకేతికతతో ఉంటుంది. అలాగే, A12 బయోనిక్ చిప్ న్యూరల్ ఇంజిన్ తో వస్తుంది మరియు IP67 రేటింగ్తో ఉంటుంది అంటే తుంపర్లు, నీరు మరియు డస్ట్ నుండి తట్టుకునేదిగా ఉంటుందన్నమాట.
కెమేరా విభాగానికి వస్తే, వెనుక f /1.8 ఆపేర్చేరు గల ఒక 12MP కెమెరాని కలిగిఉంటుంది. ఇది 6 ఎలిమెంట్ లెన్స్ తో వస్తుంది మరియు 5X జూమ్ కూడా చేయవచ్చు. పనోరమా, బొకే మరియు పోర్ట్రైట్ వంటి అనేక ప్రత్యేకతలతో ఉంటుంది. ముందుభాగంలో, f /2.2 ఆపేర్చేరు గల ఒక 12MP కెమెరాని కలిగిఉంటుంది దీనితో 3X జూమ్ కూడా చేయవచ్చు. పనోరమా, బొకే, పోర్ట్రైట్ అనిమోజీ మరియు మెమోజి వంటి అనేక ప్రత్యేకతలతో ఉంటుంది. ఈ ఐఫోన్ XR పేస్ అన్లాక్ సపోర్ట్ తో వస్తుంది మరియు iOS 12 తో నడుస్తుంది.