Android Pie అందుకోనున్నమరో రెండు Xioami స్మార్ట్ ఫోన్లు గీక్ బెంచ్ పైన దర్శనమిచ్చాయి

Android Pie అందుకోనున్నమరో రెండు Xioami స్మార్ట్ ఫోన్లు గీక్ బెంచ్ పైన దర్శనమిచ్చాయి
HIGHLIGHTS

షావోమి రెడ్మి నోట్ 5 మరియు రెడ్మి నోట్ 5 ప్రో స్మార్ట్ ఫోనులు Android Pie పైన నడుస్తున్నట్లు కనిపించాయి.

ముఖ్యాంశాలు:

1. షావోమి రెడ్మి నోట్ 5 మరియు రెడ్మి నోట్ 5 ప్రో స్మార్ట్ ఫోనులు Android Pie పైన నడుస్తున్నట్లు కనిపించాయి

2. ఒక Snapdragon 660 తో వున్నా రెడ్మినోట్ 5 ప్రో Android 9 పైన నడుస్తున్నట్లు కనిపించింది

షావోమి రెడ్మి నోట్ 5 మరియు రెడ్మి నోట్ 5 ప్రో స్మార్ట్ ఫోనులు  Android 9.0 Pie తో నడుస్తున్నట్లు Geekbench పైన దర్శనమిచ్చాయి. అంటే, ఈ రెండు పరికరాలు కూడా త్వరలో తాజా OS అప్డేటును పొందడానికి సిద్ధమవనున్నట్లు, సూచన ప్రాయంగా తెలుస్తోంది. ఈ రెడ్మి నోట్ 5,  ఒక స్నాప్డ్రాగన్ 625 తో ప్రారంభించబడింది మరియు ప్రో వేరియంట్ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ పైన నడుస్తుంది, అయినప్పటికీ, ఈ కొత్త బెంచ్మార్క్ లిస్టింగ్ రెడ్మినోట్ 5 ప్రో యొక్క వేరియంట్ను చూపిస్తుంది, ఇది Snapdragon 660 SoC ద్వారా ఆధారితమైనది.

Xiaomi Note 5 and Pro.jpg

GizmoChina ప్రకారం, Snapdragon 660 యొక్క ఉనికిని "Geekbench యొక్క ఎంట్రీ భాగంలో ఒక తప్పుగా అనిపించడం లేదు, బేస్ ఫ్రీక్వెన్సీ Mi 8 లైట్ మరియు మి A2 వంటి ఇతర స్నాప్డ్రాగెన్ 660- పవర్డ్ ఫోన్లతో సరిపోలుతుంది. అయితే, దాని స్కోర్లు తక్కువగా ఉంటాయి. ఈ రెడ్మి నోట్ 5 ప్రో యొక్క వెర్షన్ కూడా 3GB RAM మరియు Android 8.1 Oreo నడుస్తుంది. అయితే, ఈ సంవత్సరం ప్రారంభంలో Xiaomi ఈ ఫోన్లను Android  7.1.2 Nougat తో ప్రారంభించింది  మరియు తరువాత ఈ ఫోనులు ఆండ్రాయిడ్ Oreo కు అప్గ్రేడ్ చేయబడ్డాయి.

రెడ్మి నోట్ 5, ఒక  5.99 అంగుళాల FHD + 18: 9 డిస్ప్లేను 2160 x 1080p రిజల్యూషన్తో కలిగి ఉంది మరియు క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 625 SoC చే శక్తిని కలిగి ఉంది. ప్రాసెసర్ 3GB / 4GB RAM మరియు 32GB / 64GB స్టోరేజితో జతగా వస్తుంది . ఈ స్మార్ట్ ఫోన్,  ఒక 12MP వెనుక కెమెరాతో f / 2.2 ఎపర్చరు లెన్స్ మరియు ఒక LED ఫ్లాష్ మరియు ఒక 5MP ఫ్రంట్-ఫేసింగ్ సెన్సార్ కలిగి ఉంటుంది. 4000mAh బ్యాటరీతో ఈ స్మార్ట్ మంచి మద్దతు ఇస్తుంది.

Xiaomi Note 5 Pro SDM660.jpg

షావోమి రెడ్మి నోట్ 5 ప్రో రెండు వేరియంట్లలో ప్రారంభించబడింది, 4GB RAM / 64GB స్టోరేజి మరియు మరొకటి 6GB RAM / 64GB స్టోరేజి. ఈ పరికరం ఒక 5.99 అంగుళాల FHD + 18: 9 డిస్ప్లే మరియు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసరుతో ఉంటుంది.  ఇది ఒక 12MP + 5MP డ్యూయల్ – వెనుక కెమెరా సెటప్ కలిగి ఉంటుంది మరియు ముందు సెల్ఫీ- లైట్ మరియు బైటిఫై 4.0 ఫీచర్ గల  ఒక 20MP సెన్సార్ ఉంది. 4000 mAh బ్యాటరీ  ఈ ఫోన్ను సమర్థవంతంగా నిర్వహిస్తుంది, మరియు రియర్ మౌండెడ్ ఫింగర్ ప్రింట్  సెన్సార్ను కలిగి ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo