2014 చివరిలో బ్లాక్ బెర్రీ నుండి ఆండ్రాయిడ్ ఫోన్ రానుంది అనే న్యూస్ బాగా వినిపించింది. అయితే దాని పై స్పందిస్తూ, బ్లాక్ బెర్రీ అఫిషియల్ గా ఆ విషయాన్ని అనౌన్స్ చేయటంతో అందరూ ఆశక్తి గా ఎదురుచూసే మోడల్ గా మారింది.
ఇప్పుడు లేటెస్ట్ గా బ్లాక్ బెర్రీ పాస్ పోర్ట్ సిల్వర్ మోడల్ ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతున్న ఇమేజ్ ఒకటి ఇంటర్నెట్ లో బాగా హాల్ చల్ చేస్తుంది. ఇది 2016 లో రిలీజ్ అవనుంది. దీని పేరు బ్లాక్ బెర్రీ పాస్ పోర్ట్ 2 అని కూడా కన్ఫర్మ్ అయ్యింది.
అయితే దీని కన్నా ముందు 2015 చివరికల్లా బ్లాక్ బెరీ venice కోడ్ నేమ్ తో తయారీ దశలో ఉన్న మరొక ఫోన్ రిలీజ్ అవుతుంది. ఇది సక్సెస్ అయితే బ్లాక్ బెర్రీ మిగిలిన ఆండ్రాయిడ్ ఫోన్స్ పై దృష్టి సారిస్తుంది అని రిపోర్ట్స్.
బ్లాక్ బెర్రీ venice లో 5.4 in QHD LCD కర్వ్ద్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 808 SoC, 3gb ర్యామ్, 18MP అండ్ 5MP కేమేరాస్ ఉండనున్నాయని రూమర్డ్ స్పెక్స్ చెబుతున్నాయి. దీనికి స్లైడింగ్ ఫిజికల్ కీ బోర్డ్ కూడా ఉండనుంది.
అంటే సఫ్త్వ్ వేర్ కీ బోర్డ్ తో పాటు ఫిజికల్ కీ బోర్డ్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్. తాజగా శామ్సంగ్ నోట్ 5 మోడల్ కు కూడా కంపెని ఫిజికల్ కీ బోర్డ్ ను తయారు చేసింది. ఇది అంతా చూస్తుంటే ఫ్యూచర్ లో మనం స్మార్ట్ ఫోన్స్ ను ఫిజికల్ కీ బోర్డ్ తో వాడటానికి ఇష్టపడతామా?
ఆధారం: 4G న్యూస్