గతంలో మోటోరోలా అనౌన్స్ ఆండ్రాయిడ్ Nougat – N 7.0 వెర్షన్ అప్ డేట్స్ వచ్చే ఫోనులను ప్రకటించింది. ఆ లిస్టు లో G సిరిస్ లో 4th జనరేషన్ ఫోనులున్నాయి.
ఇప్పుడు చెప్పినట్లుగానే కొందరు G4 users రిపోర్ట్స్ ప్రకారం ఆండ్రాయిడ్ N – Nougat అప్ డేట్ రోల్ అయ్యింది OTA అప్ డేట్ ద్వారా.
moto G4 తో పాటు MOTO G4 plus మొబైల్స్ కు కూడా ఆండ్రాయిడ్ 7.0 అప్ డేట్ వచ్చింది అని తెలిపారు. పైగా ఇది ఏదో బీటా అప్ డేట్ కాదు, ఫైనల్ అప్ డేట్ అని రిపోర్ట్.
ఆండ్రాయిడ్ N అప్ డేట్ వచ్చిందో లేదా ఎలా చెక్ చేసుకోవాలి?
మీరు వాడుతున్న ఫోన్ కంపెని అప్ డేట్ గురించి ముందే అనౌన్స్ చేస్తుంది. అలా చేసినట్లు అయితే మీ ఫోన్ మెయిన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి క్రింద ఉండే About Phone పై టాప్ చేయండి. ఇప్పుడు system updates అని ఉంటుంది. దాని పై టాప్ చేసి చెక్ చేయండి. కొన్ని ఫోనులు WiFi ఇంటర్నెట్ లో ఉన్నప్పుడే OTA అప్ డేట్స్ ను చూపిస్తాయి.