ఆండ్రాయిడ్ 6.0 కు అప్ గ్రేడ్ అయ్యే ఆసుస్, Oneplus , మోటో, HTC, LG, హానర్ ఫోన్స్ లిస్ట్

Updated on 17-Nov-2015

ఆసుస్ తాజాగా ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0 కు అప్ గ్రేడ్ అయ్యే ఫోన్స్ లిస్ట్ తెలియజేసింది. PadFone S (PF500KL), ZenFone Selfie (ZD551KL), ZenFone 2 (ZE550ML and ZE551ML) అండ్ ZenFone 2 Deluxe (ZE551ML). జెన్ ఫోన్ 2 లేసర్ యొక్క 5 వేరియంట్స్.. ZenFone 2 Laser, ZE500KG, ZE500KL, ZE550KL, ZE600KL, and ZE601KL లకు కూడా అప్ డేట్ వస్తుంది. కంపెని అప్ డేట్ ఎప్పుడు వస్తాయి అండ్ ఇంకా ఇతర ఫోన్స్ ఈ లిస్ట్ లోకి యాడ్ అవుతాయా అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు.

నిన్న oneplus బ్రాండ్ కూడా Oneplus 2 2016 మొదటి మూడు నెలల్లో ఆండ్రాయిడ్ 6.0 కు అప్ గ్రేడ్ అవుతుంది అని వెల్లడించింది. oneplus x అండ్ one కు మాత్రం తెలపలేదు.

HTC అండ్ LG కూడా మార్ష్ మల్లో అప్ డేట్ లిస్ట్ వెల్లడించాయి. HTC లో  One M9, M8, M9+, E9+, E9, One ME, E8, M8 EYE, బటర్ ఫ్లై 3, desire 826, 820, 816 మోడల్స్ కు 6.0 అప్ డేట్ రానుంది. వీటిలో M9 అండ్ M8 కు ఈ ఇయర్ ఎండింగ్ లో వస్తుంది అప్ డేట్.

HTC one A9 లాస్ట్ month 6.0 తో లాంచ్ అయ్యింది మోడల్. ఇదే మొదటి Non – Nexus మోడల్ 6.0 తో రిలీజ్ అవటం.  LG G4 కు పోలాండ్ వంటి రిజియన్స్ లో అప్ డేట్ స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ. మిగిలిన మార్కెట్స్ లో త్వరలోనే వస్తుంది.

హానర్ బ్రాండ్ లో హానర్ 7 కు ముందుగా అప్ డేట్ వస్తుంది అని కంపెని తెలిపింది. కంపెని ఆల్రెడీ బీటా మార్ష్ మల్లో పై వర్క్ చేస్తున్నట్లు కూడా వెల్లడించింది.

మోటో x స్టైల్ అండ్ మోటో x 2nd Gen కు కూడా 6.0 అప్ డేట్ ను రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది మోటోరోలా రీసెంట్ గా. లాస్ట్ ఇయర్ లాలిపాప్ అప్ డేట్ అందుకున్న మొదటి మోడల్, మోటో x 2nd gen.

వీటితో పాటు ఆండ్రాయిడ్ వన్ పేరుతో లాంచ్ అయిన మైక్రోమాక్స్ కాన్వాస్ A1, కార్బన్ sparkle V అండ్ స్పైస్ dream Uno కు కూడా ఆండ్రాయిడ్ 6.0 అప్ డేట్స్ వస్తున్నాయి. లావా పిక్సెల్ V1 మోడల్ పై మాత్రం స్పషత లేదు.

సోనీ కూడాలాస్ట్ month  ఓపెన్ డివైజెస్ ప్రోగ్రాం క్రింద AOSP ఆండ్రాయిడ్ 6.0 కాన్ఫిగరేషన్ మరియు binaries ను రిలీజ్ చేసింది అన్ని సపోర్టింగ్ xperia డివైజెస్ కు.

ఆండ్రాయిడ్ 6.0 అప్ డేట్ లో బ్యాటరీ, ర్యామ్ మేనేజ్ మెంట్ ఆప్టిమైజేషన్స్ అండ్ బెటర్ ప్రైవేసీ సెట్టింగ్స్ ఉన్నాయి. అలాగే యాప్స్ కు పర్మిషన్స్ ఒక్కొకటిగా ఇవ్వగలరు 6.0 లో. ఫింగర్ ప్రింట్ ఇక నేటివ్ సపోర్ట్ తో ఉంటుంది. గూగల్ నౌ ఆన్ టాప్ ఫీచర్. ఇది మనం వాడుతున్న యాప్ ను exit చేయకుండానే మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ పొందటానికి useful.

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :