11,999 రూ లకు VR హెడ్ సెట్ లేకుండా 12,499 రూ లకు VR హెడ్ సెట్ తో లాంచ్ అయ్యి ప్రస్తుతం 1,200 రూ లకు VR ను సెపరేట్ గా 11,999 రూ లకు Lenovo Vibe K4 నోట్ ను సెపరేట్ గా సెల్ చేస్తుంది కంపెని.
ఈ ఫోన్ కు ఇండియా తో పాటు మరి కొన్ని దేశాలలో కంపెని అఫీషియల్ గా ఆండ్రాయిడ్ M(మార్ష్ మల్లో) 6.0 అప్ డేట్ ను విడుదల చేసింది.
ఇది నిన్న OTA అప్ డేట్ ద్వారా రోల్ అయ్యింది. మీకు WiFi ఉంటే ఫోన్ మెయిన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి About Phone -> System Update పై టాప్ చేస్తే అప్ డేట్ వస్తుంది.
అప్ డేట్ సైజ్ 1.6GB (1664MB). ఫోన్ విషయానికి వస్తే Low లైటింగ్ లో ఫోటోస్ క్వాలిటీ బాగోదు. కాని మిగిలిన విషయాలన్నీ బాగుంటాయి. అయితే ప్రస్తుత పోటీలో మిగిలిన ఫోనులతో పోలిస్తే ఫర్వాలేదు అని చెప్పాలి. కరెంట్ మార్కెట్ లో దీని కన్నా రెడ్మి నోట్ 3, LeEco Le 1S, లెనోవో ZUK Z1 బెటర్ పెర్ఫర్మర్స్ మాత్రమే కాదు ఓవర్ ఆల్ గా కూడా బెటర్ ఫోనులు.
lenovo K4 note కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో చూడగలరు. అయితే లెనోవో అఫీషియల్ ఫోరమ్ లో కొంతమంది అప్ డేట్ చేసుకున్న వారు రెండు మూడు issues ను తెలియజేశారు. అప్ డేట్ చేసుకునే ముందు అవేంటో చూడండి ఈ లింక్ లో.