ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ iQOO 12 5G లాంచ్ డేట్ మరియు స్పెక్స్ తో అమేజాన్ టీజింగ్ స్టార్ట్ చేసింది. ఈ అప్ కమింగ్ ఐకూ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే చైనాలో లాంచ్ చేయబడింది మరియు డిసెంబర్ 12 న ఇండియాలో కూడా లాంచ్ అవుతుంది. ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Gen 3 ప్రోసెసర్ తో చైనా మార్కెట్ ను ఆకట్టుకుంటోంది. అలాగే, ఇదే ప్రోసెసర్ మరియు మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్ లో కూడా లాంచ్ అవ్వడానికి సిద్దమయ్యింది.
ఐకూ 12 5జి స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్ లో డిసెంబర్ 12వ తేదీ విడుదల అవుతుందని అమేజాన్ టీజర్ చెబుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అమేజాన్ అందించింది. ఈ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ నుండి ఐకూ 12 ఫోన్ యొక్క స్పెక్స్ మరియు ఫీచర్స్ తో టీజింగ్ ను కూడా మొదలు పెట్టింది. అంటే, ఐకూ 12 5జి స్మార్ట్ ఫోన్ అమేజాన్ నుండి సేల్ అవుతుందని క్లియర్ చేసింది.
Also Read : Flipkart Sale చివరి రోజు Moto G54 5G పైన ధమాకా ఆఫర్.!
ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ గురించి అమేజాన్ అందించిన టీజర్ పేజ్ నుండి ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రోసెసర్ తో లాంచ్ అవుతున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఈ ఫోన్ ఫీచర్స్ ను ఒక్కొక్కటిగా విడుదల చేయనున్నట్లు టీజర్ పేజ్ ద్వారా సూచిస్తోంది. ఈ ఫోన్ అచ్చంగా చైనా లో విడుదలైన ఫోన్ మాదిరిగా ఉంటుందో, లేక ఏవైనా మార్పులు ఉంటాయో వేచి చూడాలి.
ఇక చైనా మార్కెట్ లో విడుదలైన ఐకూ 12 5జి స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే, 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లేని 144Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR సపోర్ట్ కలిగి వుంది. ఈ ఫోన్ Snapdragon 8 Gen 3 (3.3GHz) ఫాస్ట్ ప్రోసెససర్ కి జతగా 12GB/16GB మరియు 256GB / 512GB / 1TB భారీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ లతో కలిగి వుంది. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీని భారీ 120W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా కలిగి వుంది.
ఐకూ ఈ ఫోన్ లో 50 MP (1/1.3-inch) మెయిన్ సెన్సార్ + 64MP పెరిస్కోప్ టెలిఫోటో + 50MP అల్ట్రా వైడ్ సెన్సార్ తో కెమేరా సెటప్ కలిగి వుంది. ఈ ఫోన్ కెమేరాతో 8K రిజల్యూషన్ వీడియోలను చిత్రీకరించవచ్చు మరియు 1080P slow motion వీడియోలకు కూడా సపోర్ట్ చేస్తుంది.