HONOR 200 5G స్మార్ట్ ఫోన్ పై ఈరోజు అమెజాన్ ఇండియా రూ. 11,000 రూపాయల భారీ డిస్కౌంట్ ప్రకటించింది. 2024 సంవత్సరం చివరి సేల్ గా తీసుకొచ్చిన హాలిడే ఫోన్ ఫెస్ట్ సేల్ నుంచి ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ ను అనౌన్స్ చేసింది. ఈ సేల్ డిసెంబర్ 25 నుంచి జనవరి 2 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. సూపర్ డిజైన్ మరియు పవర్ ఫుల్ కెమేరాతో వచ్చిన ఈ హానర్ స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ అందించిన డీల్ ప్రైస్ మరియు ఫోన్ ఫీచర్స్ తెలుసుకోండి.
హానర్ 200 5జి స్మార్ట్ ఫోన్ ఇండియా లో రూ. 34,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ అందించిన రూ. 8,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 26,999 రూపాయల ధరకు సేల్ అవుతోంది. అయితే, ఈ ఆఫర్ ను 8GB + 128GB బేసిక్ వేరియంట్ పై మాత్రమే అందించింది.
అయితే, అమెజాన్ సేల్ నుంచి అందించిన ప్రత్యేకమైన కూపన్ ఆఫర్ ద్వారా ఈ ఫోన్ మరింత తక్కువ ధరకు లభిస్తుంది. అమెజాన్ ఈ సేల్ నుంచి రూ. 3,000 రూపాయల ప్రత్యేకమైన కూపన్ ఆఫర్ ను అందించింది ఈ ఆఫర్ ద్వారా ఈ ఫోన్ కేవలం రూ. 23,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఆఫర్ చెక్ చేయడానికి Click Here పై నొక్కండి.
Also Read: Upcoming: చవక ధరలో పెద్ద స్క్రీన్ మరియు కొత్త లుక్స్ తో కొత్త ఫోన్ తెస్తున్న itel
హానర్ 200 5జి స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 7 Gen 3 చిప్స్ సెట్, 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ AI-Powered MagicOS 8.0 సాఫ్ట్ వేర్ తో Android 14OS పై నడుస్తుంది. ఈ ఫోన్ లో 5200 mAh 2జెన్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ 100W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.
ఈ హానర్ స్మార్ట్ ఫోన్ ప్రీమియం కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP OIS వైడ్ యాంగిల్ మెయిన్, 50MP OIS టెలిఫోటో మరియు 12MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. ఈ ఫోన్ లో ముందు 50MP పోర్ట్రైట్ సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ లో ఉన్న ఫ్రెంట్ మరియు బ్యాక్ రెండు కెమెరాలతో కూడా 4K Video లను షూట్ చేయవచ్చు.