అమెజాన్ సేల్ నుండి డెడ్ చీప్ గా లభిస్తున్న ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్లు..!

Updated on 12-May-2023
HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2023 మరికొన్ని గంటల్లో ముగుస్తుంది

అమెజాన్ టాప్ డీల్స్ ప్రకటించింది

చివరి రోజు చివరి సమయంలో లభిస్తున్న టాప్ డీల్స్

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2023 మరికొన్ని గంటల్లో ముగుస్తుందనగా అమెజాన్ టాప్ డీల్స్ ప్రకటించింది. ఇటీవలే ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయిన కొన్ని ప్రీమియం మరియు మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లను ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే సేల్ చేస్తోంది. అందుకే, అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2023 నుండి చివరి రోజు చివరి సమయంలో లభిస్తున్న టాప్ డీల్స్ గురించి తెలుసుకోండి. 

Redmi K50i 5G

అమెజాన్ సేల్ నుండి రెడ్ మి యొక్క లేటెస్ట్ 5G ఫోన్ K50i స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ. 20,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ రూ. 25,999 ధరతో వచ్చింది. ఈ ఫోన్ ఇంత తక్కువ ధరకు లభించడం ఇదే మొదటి సారి. ఈ ఫోన్ ను ICICI మరియు Kotak బ్యాంక్ డెబిట్ / క్రెడిట్ కార్డ్ మరియు EMI అఫర్ లతో కోనేవారు రూ. 1,000 డిస్కౌంట్ కూడా పొందుతారు. ఈ ఫోన్ 144Hz Dolby Vision సపోర్ట్ డిస్ప్లే వంటి ఫీచర్లను కలిగి వుంది. Buy From Here

Samsung Galaxy S20 FE 5G

శామ్సంగ్ యొక్క ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం రూ. 26,990 డిస్కౌంట్ ధరకే లభిస్తోంది మరియు ఈ ఫోన్ ఇంత తక్కువ ధరకు సేల్ అవ్వడం కూడా ఇదే ప్రథమం. ఈ ఫోన్ ప్రమియం కెమేరా సెటప్, 120Hz FHD+ AMOLED డిస్ప్లే, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, 30X Space Zoom, స్నాప్ డ్రాగన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ ఇండియాలో రూ. 55,999 ధరలో లాంచ్ అయ్యింది. Buy From Here                 

Xiaomi 12 Pro

ఇండియన్ మార్కెట్ లో రూ. 62,000 ధరలో అడుగు పెట్టిన ఈ షియోమి ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ సేల్ నుండి రూ. 44,999 ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పైన రూ. 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ కూడా లభిస్తుంది. దీనికోసం, ICICI లేదా Kotak బ్యాంక్ డెబిట్ / క్రెడిట్ లేదా EMI అప్షన్ తో ఈ ఫోన్ ను కొనుగోలు చెయ్యాలి. Buy From Here 

ఈ ఫోన్ Dolby Vison, HDR 10+ సపోర్ట్ కలిగిన డిస్ప్లే, ట్రిపుల్ 50MP రియర్ కెమేరా, 8 Gen 1 ప్రోసెసర్, 120W ఫాస్ట్ ఛార్జ్ వంటి మరిన్ని భారీ ఫీచర్లను కలిగి వుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :