OnePlus 11R 5G పైన రూ. 10,000 భారీ డిస్కౌంట్ అందించిన Amazon

Updated on 16-May-2024
HIGHLIGHTS

OnePlus 11R 5G పైన అమెజాన్ రూ. 10,000 భారీ డిస్కౌంట్

బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లను కూడా అమెజాన్ ఆఫర్ చేస్తోంది

ఈ బిగ్ డిస్కౌంట్ దెబ్బకి OnePlus 11R 5G ఎన్నడూ చూడనంత చవక ధరకే లభిస్తోంది

ప్రముఖ చైనీస్ బ్రాండ్ యొక్క ప్రీమియం స్మార్ట్ ఫోన్ OnePlus 11R 5G పైన అమెజాన్ రూ. 10,000 భారీ డిస్కౌంట్ అందించింది. అమెజాన్ అందించిన ఈ బిగ్ డిస్కౌంట్ దెబ్బకి ఈ స్మార్ట్ ఫోన్ ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ పైన ఎక్స్ చేంజ్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లను కూడా అమెజాన్ ఆఫర్ చేస్తోంది. అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ పైన ఆ ఒక లుక్కేయండి.

OnePlus 11R 5G Big Deal

వన్ ప్లస్ 11R 5G స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 39,999 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేయబడింది. ఈ ఫోన్ పైన అమెజాన్ ఈరోజు రూ.10,000 డిస్కౌంట్ ను అందించింది. ఈ డిస్కౌంట్ దెబ్బకి ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ రూ. 28,499 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది.

OnePlus 11R 5G Offer Price

ఈ ఫోన్ ను ఈ రోజు అమెజాన్ నుండి Canara Bank Credit తో టోటల్ పేమెంట్ చేసే వారికి రూ. 500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే,ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను రూ. 27,999 ధరకే అందుకోవచ్చు. ఈ ఫోన్ పైన మంచి ఎక్స్ చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంచింది అమెజాన్ ఇండియా. ఈ ఫోన్ ను ఆఫర్ ధరకే కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Also Read: Smart Tv Deals: మంచి డిస్కౌంట్ తో 8 వేల ధరలో లభిస్తున్న పెద్ద టీవీలు.!

OnePlus 11R 5G ప్రత్యేకతలు

వన్ ప్లస్ 11R స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ 120 Hz Super Fluid AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ స్క్రీన్ HDR10+ సపోర్ట్ మరియు 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 8+ Gen 1 ప్రోసెసర్ తో నడుస్తుంది మరియు దీనికి జతగా 8GB RAM తో మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.

OnePlus 11R 5G

ఈ ఫోన్ లో అద్భుతమైన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP Sony IMX890 (OIS) మెయిన్, 8MP అల్ట్రా వైడ్ మరియు Macro Lens వుంది. అలాగే, 16MP సెల్ఫీ కెమెరా EIS సపోర్ట్ తో ఉంటుంది. ఈ ఫోన్ మెయిన్ కెమెరాతో 4K వీడియో లను 60fps/30fps వద్ద షూట్ చేయవచ్చు.

ఇక ఫోన్ బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 100W SUPERVOOC ఛార్జ్ సపోర్ట్ కలిగిన 500 mAh బిగ్ బ్యాటరీ వుంది. అమెజాన్ ఈరోజు ఆఫర్ చేస్తున్న ప్రైస్ లో ఈ ఫోన్ గొప్ప డీల్ గా నిలుస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :