Xiaomi 12 Pro పైన భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.!

Xiaomi 12 Pro పైన భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.!
HIGHLIGHTS

Xiaomi 12 Pro పైన అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది

ఆఫర్ల ద్వారా మీరు ఈ ఫోన్ ను రూ.14,000 డిస్కౌంట్ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు

ఈ స్మార్ట్ ఫోన్ పైన అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఆఫర్ల పైన ఒకలుక్కేద్దాం పదండి

Xiaomi 12 Pro స్మార్ట్ ఫోన్ పైన అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది. డిస్కౌంట్ మరియు అమెజాన్ కూపన్ అఫర్ తో కలిపి రూ.14,000 తగ్గింపును ఈ షియోమి స్మార్ట్ ఫోన్ పైన అందుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ భారీ కెమెరా సెట్టింగ్, 2K+ Cuirved  AMOLED డిస్ప్లే మరియు 120W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి గొప్ప స్పెక్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ పైన అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఆఫర్ల పైన ఒకలుక్కేద్దాం పదండి. 

Xiaomi 12 Pro: ధర మరియు ఆఫర్లు 

షియోమీ 12 ప్రో యొక్క బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో రూ. 62,000 ధరతో వచ్చింది. అయితే, ఇప్పడు అమెజాన్ నుండి రూ.55,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ పైన 2,000 రూపాయల కూపన్ అఫర్ ను కూడా లభిస్తోంది. మరి ముఖ్యంగా ఈ ఫోన్ పైన All Banks డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, డెబిట్/క్రెడిట్ కార్డ్ EMI ల పైన ఫ్లాట్ 6,000 డిస్కౌంట్ ను అమెజాన్ అఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ల ద్వారా మీరు ఈ ఫోన్ ను రూ.14,000 డిస్కౌంట్ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. Buy From Here  

Xiaomi 12 Pro: స్పెక్స్

షియోమి 12 ప్రో ఒక ప్రీమియం స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ యొక్క ఫీచర్లను కూడా ప్రీమియం గానే అందించింది. ఈ ఫోన్ 10-bit 6.73-అంగుళాల 2K+ (3200×1440 పిక్సెల్స్) రిజల్యూషన్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Dolby Vision మరియు HDR10+ సపోర్ట్ తో పాటుగా 120Hz రిఫ్రెష్ రేట్‌ మరియు 480Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ప్రీమియం డిస్ప్లే మరింత పటిష్టంగా ఉంచేలా గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో ఈ డిస్ప్లే ని అందించింది.

ఈ ఫోన్ లేటెస్ట్ క్వాల్కమ్ ప్రొసెసర్ Snapdragon 8 Gen1 SoC తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ LPDDR5 12GB RAM మరియు UFS 3.1 256GB వరకు స్టోరేజ్ ఎంపికతో జత చేయబడింది మరియు MIUI 13 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ లో OIS తో 50MP (IMX707) కెమెరా జతగా 50MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP టెలిఫోటో కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఈ కెమెరాతో 24fps వద్ద 8K వీడియోలను, 60fps వద్ద 8K వీడియోలను చిత్రీకరించవచ్చు. అలాగే, సెల్ఫీల కోసం  ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరాతో HDR 10+ వీడియోలను చిత్రీకరించవచ్చు 

Xiaomi 12 Pro స్టీరియో స్పీకర్‌ లను కూడా కలిగి ఉంది మరియు 4,600mAh బ్యాటరీని భారీ 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ మరియు 50W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో ఈ ఫోన్ లో అందించింది. అంతేకాదు, 10W రివర్స్ వైర్ లెస్ ఛార్జింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది.  ఈ ఫోన్ కౌటర్ బ్లూ, నోయిర్ బ్లాక్ మరియు ఒపేరా మౌవే అనే మూడు విలక్షణమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo