కొత్త Fold Phone పైన అమెజాన్ భారీ ఆఫర్: 50 వేలకే కొత్త ఫోల్డ్ ఫోన్ అందుకోండి.!

Updated on 11-Jul-2024
HIGHLIGHTS

మొబైల్ తయారీ కంపెనీలు మార్కెట్ లో కొత్త Fold Phone లను విరివిగా విడుదల చేస్తున్నాయి

ఫోల్డ్ ఫోన్ పొందడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం

అమెజాన్ అందించిన ఆఫర్ తో కొత్త ఫోల్డ్ ఫోన్ ను 50 వేల కంటే తక్కువ ధరకే అందుకోండి

ప్రస్తుతం Fold Phone ల పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే కావచ్చు, మొబైల్ తయారీ కంపెనీలు మార్కెట్ లో కొత్త ఫోల్డ్ ఫోన్ లను విరివిగా విడుదల చేస్తున్నాయి. అయితే, ఫోల్డ్ ఫోన్ పొందడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయంగా ఉంటుంది. కానీ, ఈరోజు అమెజాన్ అందించిన ఆఫర్ తో కొత్త ఫోల్డ్ ఫోన్ ను 50 వేల కంటే తక్కువ ధరకే అందుకునే అవకాశం అందిస్తుంది.

ఏమిటా Fold Phone ఆఫర్?

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ TECNO రీసెంట్ గా ఇండియాలో విడుదల చేసిన ఫోల్డ్ ఫోన్ Phantom V Fold 5G ఈరోజు మంచి డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 89,999 రూపాయల ధరతో విడుదల అయ్యింది. అయితే,ఈ ఫోల్డ్ ఫోన్ ఈరోజు రూ. 20,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 69,999 రూపాయల ఆఫర్ ధరకు లిస్ట్ అయ్యింది.

ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ పైన రూ. 15,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అమెజాన్ జత చేసింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 54,999 రూపాయల ఆఫర్ ధరకే పొందవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ ను HDFC Bank క్రెడిట్ కార్డు తో 24 నెలల EMI పైన కొనుగోలు చేస్తే రూ. 5,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇవన్నీ కలిపి చూస్తే, ఈ ఫోన్ ను అన్ని ఆఫర్లతో కలిపి 50 వేల కంటే తక్కువ ధరకి పొందవచ్చు. Buy From Here

Also Read: Jio New Plans: కస్టమర్ల అలక తీర్చేందుకు కొత్త Unlimited 5G Data ప్లాన్స్ తెచ్చిన జియో.!

TECNO Phantom V Fold 5G

టెక్నో ఫాంటమ్ V ఫోల్డ్ 5జి ఫోల్డ్ ఫోన్ 2K+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 7.85 ఇంచ్ మడతపెట్టే LTPO డిస్ప్లే కలిగి ఉంటుంది. దీనితో పాటు 6.42 ఇంచ్ ఫ్రంట్ సబ్ డిస్ప్లే వుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ ఫోల్డ్ ఫోన్ Dimensity 9000+ పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు 12GB LPDDR5x ర్యామ్ కి జతగా 256GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

TECNO new Fold Phone

ఈ టెక్నో ఫోన్ లో లో 50MP టెలీ ఫోటో + 50MP మెయిన్ + 13MP అల్ట్రా వైడ్ ట్రిపుల్ కెమెరా. అంతేకాదు, 32MP + 16MP సెల్ఫీ కెమెరా సెటప్ కూడా వుంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :