digit zero1 awards

iQOO Neo 9 Pro 5G పై జబర్దస్త్ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!

iQOO Neo 9 Pro 5G పై జబర్దస్త్ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!
HIGHLIGHTS

iQOO Neo 9 Pro 5G పై అమెజాన్ ఈరోజు జబర్దస్త్ ఆఫర్లను ప్రకటించింది

ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రోసెసర్ తో ఆకట్టుకుంటుంది

ఇప్పుడు మంచి డిస్కౌంట్ ఆఫర్ లతో తక్కువ ధరకే అమెజాన్ నుండి లభిస్తోంది

ఐకూ ఇండియాలో విడుదల చేసిన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ iQOO Neo 9 Pro 5G పై అమెజాన్ ఈరోజు జబర్దస్త్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రోసెసర్ మరియు Sony IMX920 ఫ్లాగ్ షిప్ లెవెల్ కెమెరా వంటి ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్ లో ఫిబ్రవరి నెలలో విడుదల చేయబడింది మరియు ఇప్పుడు మంచి డిస్కౌంట్ ఆఫర్ లతో తక్కువ ధరకే అమెజాన్ నుండి లభిస్తోంది.

iQOO Neo 9 Pro 5G : ఆఫర్లు

ఐకూ నియో 9 ప్రో స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (8GB + 128GB) రూ. 34,999 ధరతో ఈరోజు అమెజాన్ నుండి లిస్ట్ చేసింది. అలాగే, రెండవ వేరియంట్ (8GB + 256GB) రూ. 36,999 ధరకు మరియు (12GB + 256GB) వేరియంట్ రూ. 38,999 రూపాయల ధరకు లిస్ట్ చేసింది. అయితే, ఈ ఫోన్ పై రూ.4,000 రూపాయల వరకూ తగ్గింపు పొందేలా రెండు గొప్ప ఆఫర్ లను కూడా జత చేసింది. 

ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ పైన రూ. 2,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ను అమెజాన్ అందిస్తోంది. ఈ ఆఫర్ తో పాటు HDFC మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ కొనుగోలు చేసే  వారికి రూ. 2,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది. అంటే, ఈ ఫోన్ ను ఈ రెండు ఆఫర్లతో కొనేవారికి మొత్తంగా రూ. 4,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్లతో ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ను రూ. 30,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకునే అవకాశం కూడా లభిస్తుంది. Buy From Here

Also Read: Nokia 3210 4G ను కొత్త టచ్ తో విడుదల చేసిన HMD.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!

iQOO Neo 9 Pro 5G: ఫీచర్స్

ఈ ఐకూ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రోసెసర్ తో వస్తుంది మరియు దీనికి జతగా LPDDR5X 12GB RAM తో గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ మరింత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కోసం సూపర్ కంప్యూటింగ్ చిప్ Q1 ను కూడా సపోర్ట్ గా జత చేసింది. ఈ ఫోన్ లో 6.78 ఇంచ్ LTPO AMOLED డిస్ప్లే వుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఉంటుంది.

iQOO Neo 9 Pro 5G Features
iQOO Neo 9 Pro 5G Features

ఈ ఫోన్ కెమెరా పరంగా గొప్ప సెటప్ ను కలిగి వుంది. ఈ ఐకూ ఫోన్ లో వెనుక 50MP Sony IMX920 నైట్ విజన్ OIS ప్రధాన కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ మెయిన్ కెమెరాతో పగటిపూట 8K UHD రిజల్యూషన్ వరకు వీడియోలు మరియు రాత్రి సమయంలో 4K వీడియోలు షూట్ చేసే వీలుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో 5160 బిగ్ బ్యాటరీ వుంది మరియు ఇది 120W ఫ్లాష్ ఛార్జ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo