Motorola Edge 50 Fusion పై భారీ తగ్గింపు అందించిన అమెజాన్ .. కొత్త రేటు ఎంతంటే.!

Updated on 28-Mar-2025
HIGHLIGHTS

Motorola Edge 50 Fusion స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ భారీ తగ్గింపు ఆఫర్ అందించింది

డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం 18 వేల బడ్జెట్ ధరలో ఈ ఫోన్ అందుకోవచ్చు

ఈ ఫోన్ ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది

Motorola Edge 50 Fusion స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ భారీ తగ్గింపు ఆఫర్ అందించింది. ఈ మోటోరోలా లేటెస్ట్ ఫోన్ ను ఈరోజు అమెజాన్ అందించిన డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం 18 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకోవచ్చు. ఈ ఫోన్ ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. అమెజాన్ ఈ ఫోన్ పై అందించిన ఆఫర్స్ మరియు ఈ ఫోన్ ఫీచర్స్ తో పాటు ఈ ఫోన్ పూర్తి వివరాలు తెలుసుకోండి.

Motorola Edge 50 Fusion: ఆఫర్ ప్రైస్

మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో రూ. 22,999 రూపాయల బేసిక్ ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇప్పుడు అమెజాన్ నుంచి రూ. 3,100 రూపాయల భారీ తగ్గింపు అందుకుని కేవలం రూ. 19,899 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ నుంచి DBS క్రెడిట్ కార్డ్ ఆఫర్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది.

ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 18,399 రూపాయల అతి తక్కువ రేటుకే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ పై ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. Buy From Here

Also Read: Big Deal: 43 ఇంచ్ టీవీ రేటుకే 50 ఇంచ్ 4K Smart Tv అందుకోండి.!

Motorola Edge 50 Fusion: ఫీచర్స్

ఇక ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ Snapdragon 7s Gen 2 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ చిప్ సెట్ కి జతగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి. ఈ ఫోన్ లో గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కలిగిన 6.67 ఇంచ్ కర్వుడ్ pOLED స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.

ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ 50 MP (Sony – LYTIA 700C) మెయిన్ కెమెరా + 13MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన క్వాడ్ పిక్సెల్ రియర్ కెమెరా మరియు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డ్ సపోర్ట్ మరియు మరిన్ని కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5000 mAh బ్యాటరీ మరియు 68W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ IP 68 అండర్ వాటర్ ప్రొటెక్షన్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :