సరసమైన Lava Curve 5G పైన ధమాకా ఆఫర్లు అందుకోండి.!

Updated on 14-Mar-2024
HIGHLIGHTS

ఇండియన్ బ్రాండ్ లావా కొత్త Lava Curve 5G ఫోన్ ను తీసుకు వచ్చింది

లావా Lava Curve 5G ని చాలా సరసమైన కర్వ్ డిస్ప్లే 5G ఫోన్ గా నిలబెట్టింది

ఈ సరసమైన కర్వ్ ఫోన్ ను మరింత చవక ధర అందుకునే అవకాశం కూడా అందించింది

Lava Curve 5G: దేశంలో కొనసాగుతున్న చైనా బ్రాండ్ స్మార్ట్ ఫోన్ లకు ధీటుగా ఇండియన్ బ్రాండ్ లావా కొత్త ఫోన్ ను తీసుకు వచ్చింది. అదే, లావా యొక్క లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ బ్లేజ్ కర్వ్ 5G స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ ను కేవలం రూ. 17,999 రూపాయల ట్యాగ్ తో చాలా సరసమైన కర్వ్ డిస్ప్లే 5G ఫోన్ గా నిలబెట్టింది. అయితే, ఈరోజు అమేజాన్ అందిస్తున్న ఆఫర్లతో ఈ సరసమైన కర్వ్ ఫోన్ ను మరింత చవక ధర అందుకునే అవకాశం కూడా అందించింది.

Lava Curve 5G: Price & Offers

లావా బ్లేజ్ కర్వ్ 5జి స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (8GB + 128GB) ని కేవలం రూ. 17,999 ధరకే ఇండియాలో విడుదల చేసింది. ఈ ఫోన్ ను BOBCARD EMI ఆప్షన్ తో కొనే వారికి రూ. 1,000 మరియు OneCard Credit Card EMI ఆప్షన్ తో కొనే వారికి రూ. 1,200 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అంటే, ఈ ఆఫర్ల ద్వారా ఈ ఫోన్ ను రూ. 16,999 కంటే తక్కువ ధరకే అందుకునే అవకాశం వుంది.

ఇది మాత్రమే కాదు, ఎక్స్ ఛేంజ్ ఆఫర్ తో కూడా మంచి అమౌంట్ ను ఆఫర్ చేస్తోంది. ఈ రెండు ఆఫర్లను అంది పుచ్చుకుంటే, ఈ సరసమైన కర్వ్డ్ డిస్ప్లే 5జి స్మార్ట్ ఫోన్ ను రెగ్యులర్ సస్మార్ట్ ఫోన్ ధరకే అందుకునే అవకాశం వుంది. Buy From Here

Also Read: Aadhaar Update: ఆధార్ అప్డేట్ కు చివరి అవకాశం.. త్వరపడండి.!

Lava Blaze Curve 5G: ప్రత్యేకతలు

సరసమైన ధరలో గొప్ప డిస్ప్లేటి ఈ లావా స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ లో 6.67 ఇంచ్ పరిమాణం కలిగిన 120Hz Curved AMOLED డిస్ప్లే వుంది. ఈ డిస్ప్లే Widevine L1 సప్పర్ట్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లను కూడా కలిగి వుంది. ఈ లావా ఫోన్ Dimensity 7050 ఆక్టా కోర్ 5జి ప్రోసెసర్ శక్తితో పని చేస్తుంది.

అయితే, ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఎన్నడూ చూడని విధంగా ఈ ఫోన్ లో 8GB LPDDR5 RAM మరియు UFS 3.1 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లను జత చేసి లావా ఈ ఫోన్ పైన అంచనాలను పెంచింది. వాస్తవానికి, ఈ బడ్జెట్ లో ఈ ఫీచర్ తో వచ్చిన మొదటి ఫోన్ కూడా ఇదే అవుతుంది.

కెమేరాల పరంగా కూడా ఈ ఫోన్ బాగానే ఆకట్టుకుంటుంది. ఎందుకంటే, ఈ ఫోన్ లో వెనుక 64MP (Sony సెన్సార్) మెయిన్ కెమేరాతో ట్రిపుల్ రియర్ కెమేరాని మరియు ముందు 32MP సెల్ఫీ కెమేరాని కూడా కలిగి వుంది. ఈ ఫోన్ లో బ్యాటరీ సెటప్ కూడా బాగానే వుంది. ఈ ఫోన్ లో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ వుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ స్పీకర్లను Dolby Atmos సపోర్ట్ తో కూడా అందించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :