Amazon Offer: భారీ డిస్కౌంట్ తో రూ. 19,999 కే OnePlus Nord 3 5G ఫోన్ అందుకోండి.!

Updated on 04-Jun-2024
HIGHLIGHTS

OnePlus Nord 3 5G స్మార్ట్ ఫోన్ పైన అమెజాన్ గొప్ప డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది

Nord 3 5G పైన ఈ రోజు రూ. 13,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందుకోండి

కేవలం రూ. 19,999 రూపాయల డిస్కౌంట్ ధరకు అమెజాన్ నుండి లభిస్తోంది

Amazon Offer: వన్ ప్లస్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ OnePlus Nord 3 5G స్మార్ట్ ఫోన్ పైన అమెజాన్ గొప్ప డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. 50MP Sony IMX 890 ట్రిపుల్ రియర్ కెమెరా, Dimensity 9000 SoC మరియు 80W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ వంటి గొప్ప ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో రూ. 18,999 కే లభిస్తుంది. వన్ ప్లస్ నార్డ్ 3 5జి స్మార్ట్ ఫోన్ పైన అమెజాన్ అందించిన ఆఫర్స్ పైన ఒక లుక్కేయండి.

Amazon Offer

వన్ ప్లస్ నార్డ్ 3 5జి స్మార్ట్ ఫోన్ 2023 జూలై నెలలో రూ. 33,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ ఈ రోజు రూ. 13,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 19,999 రూపాయల డిస్కౌంట్ ధరకు అమెజాన్ ఆఫర్ చేస్తోంది. వాస్తవానికి, అమెజాన్ ఈ ఫోన్ ను రూ. 20,999 రూపాయల ధరకు లిస్టింగ్ చేసింది. అయితే, ఈ ఫోన్ పైన రూ. 1,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ను కూడా అందించింది.

Amazon Offer (Screen Shot took From Amazon)

అందుకే, అన్ని ఆఫర్లతో కలిపి ఈ ఫోన్ కేవలం రూ. 19,999 రూపాయల ఆఫర్ ధరకే అమెజాన్ నుండి లభిస్తోంది. అధనంగా, ఈ ఫోన్ పై EMI వడ్డీని ఆదా చేసేలా No Cost EMI ఆఫర్ ను కూడా అమెజాన్ జత చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ పైన ఎక్స్ చేంజ్ తగ్గింపును కూడా అమెజాన్ అందిస్తోంది. Buy From Here

Also Read: First Sale:ఈ వారంలో ఫస్ట్ సేల్ కి రానున్న స్మార్ట్ ఫోన్స్ లిస్ట్.!

OnePlus Nord 3 5G

వన్ ప్లస్ నార్డ్ 3 5జి స్మార్ట్ ఫోన్ Dimensity 9000 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇది 10 లక్షలకు పైగా AnTuTU స్కోర్ నమోదు చేస్తుంది మరియు 8GB RAM తో మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వుంది మరియు ఆక్సిజన్ OS సాఫ్ట్ వేర్ పై ఆండ్రాయిడ్ 13.1 OS తో వస్తుంది.

OnePlus Nord 3 5G Specs

ఈ ఫోన్ లో 50MP Sony IMX890 మెయిన్, 8MP Sony IMX355 (అల్ట్రా వైడ్) మరియు 2MP మ్యాక్రో ట్రిపుల్ కెమెరా వుంది. ఈ ఫోన్ కెమెరాతో 60 fps వద్ద 4K వీడియోలను షూట్ చేసే వీలుంది. ఈ ఫోన్ ను 80W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీతో అందించింది. నార్డ్ 3 ఫోన్ లో HDR10+ సపోర్ట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.74 ఇంచ్ AMOLED డిస్ప్లే వుంది. ఈ స్క్రీన్  కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో అందించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :