OnePlus 13r స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ను వన్ ప్లస్ కన్ఫర్మ్ చేసింది. వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 13 ఫోన్ తో పాటుగా 13r ను కూడా విడుదల చేస్తున్నట్టు వన్ ప్లస్ ప్రకటించింది. ముందుగా కేవలం ఒక ఫోన్ గురించి మాత్రమే టీచింగ్ మొదలుపెట్టిన వన్ ప్లస్ ఇప్పుడు ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ గురించి టీజింగ్ మొదలు పెట్టింది. అయితే, వన్ ప్లస్ 13r స్మార్ట్ ఫోన్ యొక్క కీలక ఫీచర్స్ అమెజాన్ లీక్ చేసింది.
వన్ ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్ ను కూడా జనవరి 7వ తేదీ విడుదల చేస్తున్నట్లు డేట్ అనౌన్స్ చేసింది. అంటే, జనవరి 7వ తేదీ వన్ ప్లస్ 13 సిరీస్ నుంచి రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తుంది. ఈ ఫోన్స్ కోసం అమెజాన్ ఇండియా ను సేల్ పార్ట్నర్ గా ఎంచుకుంది. అందుకే, అమెజాన్ ఇండియా ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది. ఈ పేజీ నుంచి 13r ఫోన్ కీలక ఫీచర్స్ ను లీక్ చేసింది.
ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Gen 3 చిప్ సెట్ తో లాంచ్ చేస్తుంది. ఈ చిప్ సెట్ కి జతగా వన్ ప్లస్ AI సపోర్ట్ ఉంటుందని కూడా చెబుతోంది. ఈ కొత్త ఫీచర్ తో AI పవర్డ్ ఇమేజ్ లను ఈ ఫోన్ అందిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో వన్ ప్లస్ AI ఫోటో ఎడిటింగ్ టూల్స్ సపోర్ట్ కూడా ఉంటుంది.
ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరాని అందించింది మరియు జతగా LED ఫ్లాష్ కూడా ఉంటుంది. ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ స్లీక్ డిజైన్ మరియు రెండు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ లో శక్తివంతమైన 6000 mAh బ్యాటరీ మరియు అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ అందించే SuperVOOC ఛార్జ్ సపోర్ట్ ఉందని కూడా తెలిపింది.
Also Read: LG ప్రీమియం Soundbar పై ఫ్లిప్ కార్ట్ సేల్ ధమాకా ఆఫర్.!
ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ మరిన్ని ఫీచర్స్ ను త్వరలోనే టీజింగ్ పేజీ ద్వారా వెల్లడించే అవకాశం వుంది.