అమెజాన్ హ్యాపినెస్ అప్గ్రేడ్ డేస్ సేల్ నుండి Samsung Galaxy M13 5G పైన బిగ్ డీల్.!

Updated on 14-Apr-2023
HIGHLIGHTS

అమెజాన్ ప్రకటించిన హ్యాపినెస్ అప్గ్రేడ్ డేస్ సేల్ ఈరోజు నుండి స్టార్ట్ అయ్యింది

ఈ సేల్ నుండి Samsung Galaxy M13 5G పైన బిగ్ డీల్ ప్రకటించింది

గెలాక్సీ M13 5G స్మార్ట్ ఫోన్ ను భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో సేల్ చేస్తోంది

ఈ దసరా పండుగ కోసం అమెజాన్ ప్రకటించిన హ్యాపినెస్ అప్గ్రేడ్ డేస్ సేల్ ఈరోజు నుండి స్టార్ట్ అయ్యింది. ఈ సేల్ నుండి Samsung Galaxy M13 5G పైన బిగ్ డీల్ ను అమెజాన్ ప్రకటించింది. 2022 జూలై లో శామ్సంగ్ తన గెలాక్సీ బడ్జెట్ సిరీస్ M Series నుండి తీసుకొచ్చిన గెలాక్సీ M13 5G  స్మార్ట్ ఫోన్ ను భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో సేల్ చేస్తోంది. ఈ అమెజాన్ సేల్ నుండి చాలా తక్కువ ధరకే ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ ఈ ఫోన్ పెయిన్ అందించిన ఆఫర్లు మరియు ఫోన్ ఫీచర్లను క్రింద చూడవచ్చు.          

శామ్సంగ్ గెలాక్సీ M13 సిరీస్: ధర మరియు ఆఫర్లు

శామ్సంగ్ గెలాక్సీ M13 5G స్టార్టింగ్ వేరియంట్ 4జీబీ మరియు 64జీబీ స్టోరేజ్ ను రూ.13,999 ధరతో లాంచ్ చెయ్యగా, ఈ సేల్ నుండి 2,000 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ.11,999 రూపాయలకే అందిస్తోంది. మీరు ఈ ఫోన్ ను Citi క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే, 1250 రూపాయల వరకూ అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. Buy From Here   

శామ్సంగ్ గెలాక్సీ M13 5G: స్పెక్స్

శామ్సంగ్ గెలాక్సీ M13 5G స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ 5G చిప్ సెట్ Dimensity 700 శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ కూడా ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది మరియు One UI 3.1 స్కిన్ తో వుంటుంది.

కెమెరాల పరంగా, ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. ఇందులో, 50ఎంపీ మైన్ కెమెరాకి జతగా డెప్త్ కెమెరా ఉంటుంది.  ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్  5000 mAh బ్యాటరీని 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :