Samsung Galaxy S23 5G పైన 14 వేల రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్.!
Samsung Galaxy S23 5G పైన 14 వేల రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్
అమేజాన్ కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా అందిస్తోంది
కొత్త సంవత్సరం సందర్భంగా ఈ భారీ ఆఫర్ అందించిన అమేజాన్
Samsung Galaxy S23 5G పైన 14 వేల రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. శామ్సంగ్ ప్రీమియం సిరీస్ గా పేరొందిన ‘S’ సిరీస్ నుండి వచ్చిన ఈ ఫోన్ భారీ స్పెక్స్ మరియు ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ పైన అమేజాన్ కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా అందిస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ భారీ ఆఫర్ ను జత చేసినట్లు మనం చూడవచ్చు. ఈ శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ పైన అమేజాన్ అందించిన ఆ ఆఫర్లేమిటో ఒక లుక్కేయండి.
Samsung Galaxy S23 5G Offers
శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 5జి స్మార్ట్ ఫోన్ కంపెనీ వెబ్సైట్ మరియు అమేజాన్ నుండి కూడా రూ. 74,999 రూపాయల ప్రారంభ ధరతో లిస్ట్ చెయ్యబడింది. అయితే, అమేజాన్ ఈరోజు ఈ ఫోన్ పైన రూ. 5,000 రూపాయల భారీ డిస్కౌంట్ కూపన్ ఆఫర్ ను జత చేసింది. అంతేకాదు, శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 5జి ఫోన్ ను HDFC Bank Credit Card మరియు EMI ఆప్షన్ తో కొనే వారికి రూ. 8,000 భారీ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
అంటే,ఈ రెండు ఆఫర్ తో ఈ ఫోన్ రూ. 14,000 రూపాయల తక్కువ ధరకే లభిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఫోన్ ను అమేజాన్ ఆఫర్ ద్వారా కేవలం రూ. 60,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. Buy From Here
Also Read : ఈరోజు నుండి మొదలైన POCO M6 5G Sale..ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.!
శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 5జి ప్రత్యేకతలు
శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 5జి స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ పవర్ ఫుల్ ప్రోసెసర్ Snapdragon 8 Gen 2 తో పని చేస్తుంది. దీనికి జతగా, 8GB RAM మరియు 128GB అంతర్గత మెమొరీని కలిగి వుంటుంది. ఈ ఫోన్ లో FHD+ రిజల్యూషన్ కలిగిన 6.1” Dynamic AMOLED 2X Infinity-O డిస్ప్లే వుంది. ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ను కలిగి వుంది మరియు ఇది Glass Victus 2 ప్రొటెక్షన్ తో ఉంటుంది.
శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 5జి ఫోన్ 50MP ప్రో గ్రేడ్ ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ ని మరియు AI-Boosted 12MP సెల్ఫీ కెమేరాని కలిగి వుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్ టి వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఈ కెమేరా సెటప్ తో అద్భుతమైన ఫోటోలు మరియు వీడియోలను రికార్డ్ చేయగలదు. ఈ ఫోన్ లో 3,900mAh బ్యాటరీ ఫాస్ట్ ఛార్జ్ తో కలిగి వుంది.