అప్ కమింగ్ నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్, C1

Updated on 08-Sep-2015

నోకియా ఆండ్రాయిడ్ ఫోనులు 2016 లో వస్తున్నాయని ఇంతక ముందు చెప్పుకున్నాం. మైక్రోసాఫ్ట్ తో ఏర్పరచుకున్న డీల్ కారణంగా నోకియా 2016 లో మళ్ళీ నోకియా బ్రాండ్ నేమ్ తో ఫోన్ సేల్స్ చేసుకోవచ్చు.

అంటే వేరే కంపెని ఫోన్ తయారు చేస్తే, దాని పై నోకియా బ్రాండ్ నేమింగ్ చేసుకొని లాంచ్ చేయవచ్చు. డిజైనింగ్ అండ్ ఇతర డిపార్ట్ మెంట్ లలో పనిచేస్తూ నోకియా ఈ పని చేస్తుంది అని రిపోర్ట్స్.

తాజగా ఆండ్రాయిడ్ os రన్ అవుతూ నోకియా ఫోన్ ఒకటి ఇమేజెస్ తో లీక్ అయ్యింది. గతంలోనోకియా  N1 పేరుతో  టాబ్లెట్ ను అనౌన్స్ చేసింది కూడా. ఫోటో తో పాటు స్పెసిఫికేషన్స్ పై కూడా రూమర్స్ వచ్చాయి.

నోకియా C1 లో 5 in 720P డిస్ప్లే, 2gb ర్యామ్, 8MP కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, ఆండ్రాయిడ్ లాలిపాప్ పై రన్ అవుతుంది.అయితే దీని రిలీజ్ డేట్ లేదా అనౌన్స్ డేట్ పై ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు.

గత సంవత్సరం నవంబర్ లో నొకియా N1 టాబ్లెట్ లాంచ్ అయ్యింది. సో, C1 కూడా అలానే ఈ నవంబర్ లో అనౌన్స్ అవుతుంది అని రిపోర్ట్స్. అయితే నోకియా N1 లేదా C1 ఫస్ట్ నోకియా ఆండ్రాయిడ్ డివైజెస్ అని చెప్పటం కరెక్ట్ కాదు.

నోకియా X సిరిస్ లో రిలీజ్ అయిన అన్నీ మోడల్స్ లోనూ ప్లే స్టోర్ నుండి కాకుండా సైడ్ లోడ్ మెథడ్ లో ఆండ్రాయిడ్ యాప్స్ ను వాడే అవకాశం ఇచ్చింది నోకియా.

ఆధారం: PhoneArena

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :