మోటోరోలా 2016 లో ప్రీమియం మరియు ఫింగర్ ప్రింట్ సేన్సార్స్ తో స్మార్ట్ ఫోన్స్ ను లాంచ్ చేస్తుంది. ఇందులో ఏముంది, ఏ బ్రాండ్ అయినా లాంచ్ చేస్తుంది కదా?
అవును! కాని మోటో మాత్రం ఇక ఈ ఇయర్ లో అన్నీ మినిమమ్ ఈ స్పెక్స్ తో రిలీజ్ చేస్తుంది. రీసెంట్ గా కంపెని VP ఈ విషయాన్ని తెలపటం జరిగింది.
సో బడ్జెట్ సెగ్మెంట్ లో మోటో నుండి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్న ఫోన్ ను రావట్లేనట్టే. దీనితో పాటు మినిమమ్ 5 in డిస్ప్లే తోనే రానున్నాయి అన్ని మోడల్స్.
మోటోరోలా సొంతంగా ఫింగర్ ప్రింట్ స్కానర్ తో 2011 లో Atrix 4G పేరుతో మోడల్ లాంచ్ చేసింది మార్కెట్ లోకి. మోటోరోలా పేరు ను కూడా మోటో అని మార్చటం జరిగింది లెనోవో.
సో డిజైన్ లో కూడా లెనోవో మోటో ను మార్చనుంది. గతంలో కూడా లెనోవో ప్రీమియం సెగ్మెంట్ మోటో బ్రాండ్ పేరుతో, బడ్జెట్ సెగ్మెంట్ ను వైబ్ సిరిస్ లో తేవనుంది అని స్పష్టం చేసింది.
అంతే కాదు యూజర్ ఇంటర్ఫేస్ లో కూడా కంపెని లెనోవో వైబ్ UI మరియు మోటో స్టాక్ ఆండ్రాయిడ్ UI ను కలిపి కొత్త ui పై ఆలోచనలు చేస్తుంది అని తెలిపారు లెనోవో VP.
UI changes మాత్రం 2017 లో వస్తుంది. అలాగే మోడల్స్ ను యూజర్స్ ను కంఫుస్ చేసే విధంగా ఎక్కువుగా లాంచ్ చేయరని తెలిపారు. ఇది ఆసుస్ దృష్టిలో ఉంచి చెప్పినట్లు అర్థమవుతుంది.