Alcatel ఇండియాలో GPS కలిగిన స్మార్ట్ వాచ్ ను రిలీజ్ చేసింది. ఇది పిల్లకు కోసం తయారు చేయబడింది. దీని పేరు MoveTime. ప్రైస్ 4,799 రూ.
దీని సహాయంతో వాచ్ లో ముందుగా సెట్ చేసిన contacts తో పిల్లలు మాట్లాడటానికి అవుతుంది. పేరెంట్స్ కు పిల్లల బధ్రత విషయంలో ఇది useful.
అదనంగా దీనిలో వైఫై కూడా ఉండటం వలన GPS సహాయంతో పేరెంట్స్ పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలుసుకోగలరు ఎప్పటికప్పుడు. ఫ్లిప్ కార్ట్ లో సెల్ అవుతుంది వాచ్
ఇది Nucleus అనే ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది. 0.95 in సింగిల్ OLED వైట్ కలర్ డిస్ప్లే తో వస్తుంది డివైజ్. ఆపిల్ మరియు ఆండ్రాయిడ్ ఫోనులకు కనెక్ట్ అవుతుంది ఈజీగా.
370 mah బ్యాటరీ తో ఇది రెండు గంటలు టాక్ టైం బ్యాక్ అప్ ఇస్తుంది. ఫుల్ చార్జ్ అవటానికి సుమారు 90 నిముషాలు పడుతుంది. స్టాండ్ బై లో 4 రోజులు వస్తుంది.
ఎమెర్జెన్సీ సమయాలలో నోటిఫికేషన్ ఇవ్వటానికి SOS బటన్ కూడా ఉంది స్మార్ట్ వాచ్ లో. తెలియని వారి నుండి వచ్చే incoming కాల్స్ ఆటోమాటిక్ గా reject అవుతాయి.