ప్రస్తుతం ఎయిర్టెల్ 4G ఫోనులు ఇండియాలో లాంచ్ చేసేందుకు ప్రయత్నాలను చేస్తుంది. అయితే సడెన్ గా మొబైల్ నెట్వర్క్ నుండి ఫోనులను ఎందుకు తయారు చేస్తుంది అంటే… Reliance మొబైల్ నెట్వర్క్ Jio పేరుతో 4G ఫోనులకు లాంచ్ చేస్తుంది అతి త్వరలో అది కనుక వాస్తవ రూపంలోకి వస్తే అందరూ reliance కు షిఫ్ట్ అవుతారు.
ఎందుకంటే, reliance 4G ఇంటర్నెట్ ను చవుకగా ఇండియన్ మొబైల్ యూజర్స్ అందరికీ అందించే ప్రయత్నాలు చేస్తుంది. అందుకే reliance కు పోటీగా ఎయిర్టెల్ ముందస్తూగా జాగ్రత్తలు పడుతుంది. ఇప్పటికే reliance ఫేస్ బుక్ internet.org తో ఫ్రీ ఇంటర్నెట్ అంటూ కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ తక్కువ ధరకు 4G enabled ఫోనులను లాంచ్ చేసి, ఇంటర్నెట్ ను మరింత సులభతరం చేయనుంది.
అయితే ఎయిర్టెల్ దీనిపై అఫిషియల్ గా ఇంకా అనౌన్స్ చేయలేదు. దీని బడ్జెట్ సెగ్మెంట్ 4000 నుండి 12000 రూ లలో ఉండవచ్చు అని రిపోర్ట్స్. ఇందుకోసం Foxconn వంటి ఫోన్ తయారీ సంస్థలతో టాక్స్ జరుపుతుంది ఎయిర్టెల్. ఇప్పటికే Foxconn Xiaomi ఫోనుల తయారు చేయటానికి ఆంధ్రప్రదేశ్ లో ప్లాంట్ కూడా నెలకొల్పింది. ఈ సంవత్సరం దీపావళి festive సీజన్ లో లాంగ్ టర్మ్ 4G ప్లాన్ తో ఈ ఫోనులతో యూజర్స్ ను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుంది. ఎయిర్టెల్ 2012 లోనే కలకత్తా లో మొదటి సారి 4G సేవలను ప్రారంభించింది.
ఆధారం: PTI