ఎటువంటి కండిషన్స్ లేకుండా స్మార్ట్ ఫోన్ users అందరికీ Free గా 50 మినిట్స్ ఇస్తుంది ఎయిర్టెల్ [OCT 13]

ఎటువంటి కండిషన్స్ లేకుండా స్మార్ట్ ఫోన్ users అందరికీ Free గా 50 మినిట్స్ ఇస్తుంది ఎయిర్టెల్ [OCT 13]

ముందుగా ఒక మాట… పైన ఉన్న ఇమేజ్ క్రింద తెలపడిన విషయాలకు ప్రూఫ్.

ఎయిర్టెల్ కు అంటూ ఒక యాప్ ఉంది. దీని పేరు My airtel. ఈ లింక్ పై ప్రెస్ చేస్తే apple store నుండీ, ఈ లింక్ పై ప్రెస్ చేసి ప్లే స్టోర్ నుండి యాప్ ను డౌన్లోడ్ చేసుకోగలరు. లేటెస్ట్ గా  ఈ యాప్ కు అప్ డేట్ రిలీజ్ చేసింది ఎయిర్టెల్. సైజ్ సుమారు 7MB ఉంది.

ఈ అప్ డేట్ లో కొన్ని స్పెషన్ ఫీచర్స్ తో పాటు ఫ్రీ మినిట్స్ ఇస్తుంది అందరికీ. జస్ట్ మీరు ఎయిర్టెల్ ప్రీపెయిడ్ లేదా పోస్ట్ paid యూసర్ అయ్యి, My airtel యాప్ ను అప్ డేట్ లేదా ఇంస్టాల్ చేసుకోవాలి, అంతే! ఇక క్రింద ఫీచర్స్ అన్నీ ఆస్వాదించగలరు.

కొత్త అప్ డేట్ లో యాడ్ అయిన విషయాలు..

  • సొంతంగా ఎయిర్టెల్ dailer అని ఒకటి యాడ్ అయ్యింది. Launch Now మీద టాప్ చేస్తే మీకు free గా ఎయిర్టెల్ to ఎయిర్టెల్ 50 లోకల్ అండ్ STD మినిట్స్ వస్తాయి.
  • ఈ dialer ద్వారా అదనంగా మీ జనరల్ ఫోన్ dailer సదుపాయాలు తో పాటు మీ ఫోన్ లో కాల్ ఫినిష్ అయిన వెంటనే ఎంత బాలన్స్ ఉందో చూపిస్తుంది dialer.
  • 2GB క్లౌడ్ స్టోరేజ్ స్పేస్ ఇస్తుంది ప్రతీ ఎయిర్టెల్ కస్టమర్ కు. దీని కోసం కూడా Airtel Backup మీద Launch Now ప్రెస్ చేయాలి.
  • ఈ ఎయిర్టెల్ క్లౌడ్ బాక్ అప్ ద్వారా మీ ఫోన్ లోని కాల్ హిస్టరీ, కాంటాక్ట్స్, వీడియోస్, ఫోటోస్, ఆడియో అండ్ etc స్టోర్ చేసుకోగలరు ఎయిర్టెల్ తో.
  • నైట్ time లో మీరు బ్యాక్ అప్ చేసుకుంటే, బ్యాక్ అప్ అయ్యే ప్రోసెస్ లో అవసరం అయ్యే uploading కు ఇంటర్నెట్ కు charges తీసుకోదు ఎయిర్టెల్. ఇది ప్రస్తుతానికి postpaid users కు ఇంకా రాలేదు.
  • యాప్ ను లేటెస్ట్ అప్ డేట్ తో ఇంస్టాల్ చేసుకున్న తరువాత మీ home screen లో call dailer యాప్ మరియు Airtel Apps అని రెండు షార్ట్ కట్స్ యాడ్ చేస్తుంది.
  • Airtel Apps అనేది కూడా కొత్తగా యాడ్ అయినదే. ఇది ఎయిర్టెల్ ఇతర యాప్స్ ద్వారా provide చేసే చాట్, మ్యూజిక్, మూవీస్, Live టీవీ, games వంటి సర్వీసెస్. కాని ఆ సెపరేట్ యాప్స్ ను విడిగా ఇంస్టాల్ చేసుకోవాలి..

 

అప్ డేట్ కు ముందు నుండీ ఉన్న ఫీచర్స్…

  • అలాగే ఎప్పుడూ ఉండే exclusive offers menu లో మీ నంబర్ పై అదనంగా 1GB ఇంటర్నెట్ ఆఫర్స్ లేదా ఇతర ఆఫర్స్ చూపిస్తుంది. చాలామంది వీటిని ఓవర్ లుక్ లో lite తీసుకుంటున్నారు. కాని వాటిలో నిజంగా మంచి ఆఫర్స్ ఉన్నాయి.
  • మీ ఏరియా లో 4G సిగ్నల్ ఉందా లేదా, ఏ సిగ్నల్ ఉంది అని తెలుసుకోవటానికి open network menu సహాయపడుతుంది.

 

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo