రిలయన్స్ Jio ను తట్టుకొవటానికి ఎయిర్టెల్ prices తగ్గించనున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా airtel ceo, గోపాల్ విట్టాల్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా తో మాట్లాడగా ఈ విషయం వెల్లడయ్యింది.
ఆఫర్స్, టారిఫ్స్ పై price cuts అయితే ఉంటాయి కాని Jio మాదిరిగా ఫ్రీ కాలింగ్ అయితే ఎయిర్టెల్ లో ఇవటం కష్టం అని తెలిపారు సీఈఓ గోపాల్.
PTI డైరెక్ట్ గా "ఎయిర్టెల్ prices ను తగ్గిస్తుందా" అని అడిగిన ప్రశ్న కు భారతీ ఎయిర్టెల్ "మార్కెట్ లో విపరీతమైన కాంపిటిషన్ తో కొత్త నెట్ వర్క్ వచ్చింది కాబట్టి కచ్చితంగా prices ను తగ్గిస్తుంది ఎయిర్టెల్ " అని అన్నారు.
అలాగే డ్యూయల్ సర్వీసెస్ ఇవ్వనుంది అని కూడా తెలిపారు. అంటే ఇంటర్నెట్ కు మరియు కాల్స్ కు వేరు వేరు ప్లాన్ నే కంటిన్యూ చేస్తున్నట్లు చెప్పారు.
ఆఖరిగా.. "prices ను పూర్తిగా Jio మాదిరిగా తగ్గిస్తే వినియోగదారులుకు సంతృప్తికరమైన కస్టమర్ సపోర్ట్ విషయంలో నాణ్యత తగ్గకుండా ఉండటం అనేది పెద్ద చాలెంజ్. దానిని మేము ఎప్పుడూ compromise చేయలేము" అని అన్నారు ఎయిర్టెల్ సీఈఓ.