దేశంలో కొన్ని నెలలుగా కాల్ డ్రాప్ ప్రాబ్లెం ఉంది మొబైల్ నెట్వర్క్స్ లో. దీని పై ఎప్పటి నుండో అనేక చర్చలు జరుగుతున్నాయి. నరేంద్ర మోడీ కూడా అతి త్వరగా దీనికి సల్యుషన్ కోరారు.
ఈ నేపధ్యంలో కస్టమర్స్ కు కాల్ మాట్లాడుతుండగా కట్ అవుతుండటంతో చార్జెస్ కూడా వెస్ట్ అవుతున్నాయి(per సెకెండ్ ప్లాన్ లో లేని వారికీ). దీనిపై trai examine చేయగా ఎయిర్టెల్ ఈ నిర్ణయం తీసుకుంది. మరిన్ని నెట్వర్క్స్ ఎయిర్టెల్ ను అనుసరిస్తాయేమో చూడాలి.
మీకు బేస్ ప్లాన్ per సెకెండ్ బిల్లింగ్ ఉంటే ఫర్వాలేదు. లేని వారికి కూడా ఎయిర్టెల్ ఉచితంగా ఈ రోజు నుండి per సెకెండ్ ప్లాన్ ను బేస్ ప్లాన్ గా కన్వర్ట్ చేస్తుంది. దీని వలన కస్టమర్స్ ఎన్ని సేకెండ్స్ మాట్లాడితే అంతే అమౌంట్ చార్జ్ అవుతుంది.
per సెకెండ్ ప్లాన్ లో ఉన్నా ఇంకా డిస్కౌంట్స్ కావాలని అనుకుంటే available గా ఉన్న ఆఫర్స్ ను అదనంగా అమౌంట్ పే చేసి రీచార్జ్ చేసుకోవచ్చు. ఇది ప్రీ మెయిడ్ కస్టమర్స్ కు మాత్రమే.
ఎయిర్టెల్ సీఈఓ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ… " ఎయిర్టెల్ లో 95 శాతం కస్టమర్స్ per సెకెండ్ బిల్లింగ్ ప్లాన్ లోనే ఉన్నారు. కాల్ డ్రాప్స్ issue లో మేము ఎటువంటి అమౌంట్ లను మా ఖాతా లో వేసుకోలేదు." అని అన్నారు.