Prepaid కస్టమర్స్ కు ఎయిర్టెల్ Happy Hours ఆఫర్ లాంచ్

Updated on 15-Jul-2016

Airtel ప్రీ పైడ్ కస్టమర్స్ కు Happy Hours పేరుతో కొత్త ఆఫర్ రిలీజ్ చేసింది. అయితే happy hours టైమింగ్స్ అనుకూలంగా లేవు. 

తెల్లవారుజామున 3:00 am నుండి 5:00 am లోపల మీరు ఎయిర్టెల్ హ్యాపీ హౌర్స్ ను సపోర్ట్ చేసే యాప్స్ లో ఏది డౌన్లోడ్ చేసినా 50% డేటా తిరిగి పొందుతారు.

ఇది మరీ MB ల వైజ్ గా డేటా ను లేక్కపెట్టుకొని చాలా పొదుపుగా వాడె వారికీ తప్పితే మిగిలిన వారికి రేర్ useful అనేది నిజం అని చెప్పవచ్చు.

ప్రస్తుతానికి ఎయిర్టెల్ హ్యాపీ హౌర్స్ ను YouTube అండ్ FastFilms యాప్స్ సపోర్ట్ చేస్తున్నాయి. అంటే మీరు పైన చెప్పిన timings లో Youtube నుండి ఒక 40MB వీడియో చూసిన డౌన్లోడ్ చేసినా ఎయిర్టెల్ తిరిగి మీకు 40MB లో 20MB డేటా వెనక్కి ఇస్తుంది.

YouTube లో మీరు  ఫేవరేట్ వీడియోస్ లో స్మార్ట్ ఆఫ్ లైన్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని, 'Save Overnight with Airtel Happy Hours'  ను సెలెక్ట్ చేసుకుంటే ఆ టైమింగ్స్ లో ఆటోమాటిక్ గా వీడియోస్ సేవ్ చేసుకోగలరు ఈ ఆఫర్ లో..

ఆఫర్ సెపరేట్ గా యాక్టివేట్ చేసుకోనవసరం లేదు, డిఫాల్ట్ గా అందరికీ ఉంటుంది. డేటా క్రెడిట్ ప్రతీ రోజు 6.00am తరువాత జరుగుతుంది. అయితే ఇంటర్నెట్ ప్యాక్ వేసుకోవాలి లేదంటే 0.4paisa/10kb చార్జ్ అవుతుంది.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :